![Varun Dhawan comment on being still Underpaid - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/24/varun-dhawan.jpg.webp?itok=p9V9HfhU)
ముంబై : బాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ అంటే వరుణ్ ధావనే అని చెప్పాలి. 2012లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ యువ హీరో వరుస హిట్లు, సూపర్ హిట్లు అందిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు వరుణ్ పది సినిమాల్లో నటించాడు. ఈ పది సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. బద్రీనాథ్ కి దుల్హానియా, జుడ్వా 2 వంటి రెండు సూపర్‌హిట్ సినిమాలు కూడా వరుణ్ అందించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ యువ హీరో ఎవరంటే వరుణే. అతని మీద పెట్టుబడి పెడితే.. లాభాలు గ్యారెంటీ అన్న ముద్రను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్‌కు విస్తారమైన ఇంటర్వ్యూ ఇచ్చిన వరుణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
వరుస హిట్లు అందిస్తూ.. సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నా.. తనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. వరుణ్ కెరీర్‌లో ఇప్పటివరకు 8 సినిమాలు వందకోట్ల క్లబ్బులో చేరాయి. అయినా, రెమ్యూనరేషన్ విషయంలో తాను అండర్‌పెయిడ్‌గానే ఉన్నట్టు తెలిపాడు. సినిమాల కోసం తాను పడుతున్న శ్రమకు, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే తన ఇమేజ్‌కు తగ్గ వేతనం మాత్రం ఇప్పటివరకు అందుకోలేదని చెప్పాడు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే తనకు చాలా మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘ముందుముందు ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు. కానీ సినిమాల్లో నువ్వు చూపిన శ్రమకు, నీ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినందుకు తగిన ప్రతిఫలం నీకు దక్కాలి’ అని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment