హాలీవుడ్‌కి వసంతకోకిల | vasantha kokila go to hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కి వసంతకోకిల

Published Wed, Apr 13 2016 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

హాలీవుడ్‌కి వసంతకోకిల

హాలీవుడ్‌కి వసంతకోకిల

‘వసంత కోకిల’ మళ్లీ వెండితెర  మీద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 34 ఏళ్ల  క్రితం తెలుగు, తమిళ (‘మూండ్రామ్ పిరై’), హిందీ (‘సద్మా’) భాషల్లో శ్రీదేవి, కమల్‌హాసన్ ముఖ్యపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి యాడ్ ఫిల్మ్ మేకర్ లోయడ్ బాప్తిస్తా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా తారాగణం ఖరారు కాని ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన కబురు వెలుగులోకి వచ్చింది. ‘సద్మా’కు హాలీవుడ్ వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తానని దర్శకుడు బాప్తిస్తా చెప్పారు. ‘‘ఈ రెండు వెర్షన్లకూ వేర్వేరు తారాగణాన్ని ఎంపిక చేయనున్నాం.

హిందీ వెర్షన్‌కు సంబంధించి బాలీవుడ్ నటిని తీసుకుంటాం. ఇక, హాలీవుడ్ వెర్షన్‌లో ఇప్పటికే హాలీవుడ్‌లో నటిస్తున్న ఓ ప్రముఖ బాలీవుడ్ నటిని తీసు కోవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. భారతీయ కథానాయికల్లో ఐశ్వర్యా రాయ్ హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే అక్కడ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ మల్లికా శెరావత్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇంకా ‘లంచ్ బాక్స్’ ఫేమ్ నిమ్రత్ కౌర్‌కు ఇటీవల హాలీవుడ్ ఓ అవకాశం వరించింది. మరి.. వీళ్లల్లో ‘సద్మా’ నాయిక ఎవరో? వేచి చూడాల్సిందే. అన్నట్లు  హాలీవుడ్‌లో హీరో పాత్రకు మాత్రం హాలీవుడ్ నటుడేనండోయ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement