హాలీవుడ్‌లో హార్రర్... | horror in hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌లో హార్రర్...

Published Sun, Sep 27 2015 11:01 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

హాలీవుడ్‌లో హార్రర్...

హాలీవుడ్‌లో హార్రర్...

ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్ హాలీవుడ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’లో నటించి, ఆ విధంగా హాలీవుడ్ రంగప్రవేశం చేశారు. ఇప్పుడీ తారల జాబితాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేరనున్నారు. ఇప్పటికే హిందీలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘డెఫినిషన్ ఆఫ్ ఫియర్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి జేమ్స్ సింప్సన్ దర్శకుడు. నలుగురు అమ్మాయిలు హాలిడే ట్రిప్ కోసం ఏకాంతంగా గడపడానికి పెద్ద అపార్ట్‌మెంట్‌లో దిగుతారు. కానీ అనుకోకుండా జరుగుతున్న సంఘటనలు వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తాయి. రహస్యంగా తమను ఎవరో  గమనిస్తున్నారన్న సంగతి అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్లేం చేశారు? అనే కథాంశంతో తెరకెక్కిన హార్రర్ మూవీ ఇది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement