వీణా మాలిక్ పెళ్లయిపోయిందోచ్!
వీణా మాలిక్ పెళ్లయిపోయిందోచ్!
Published Fri, Dec 27 2013 12:31 AM | Last Updated on Sat, Sep 29 2018 5:41 PM
పాకిస్తానీ మోడల్, నటి వీణామాలిక్ ఒంటరి జీవితానికి స్వస్తిపలికి ఓ ఇంటి ఇల్లాలైంది. ఇటీవల తనే ట్విట్టర్ ద్వారా తన అభిమానుల గుండెల్లో ఈ పెళ్లి బాంబు పేల్చారు. ‘నా జీవితానికి ఓ భాగస్వామి దొరికాడోచ్’ అంటూ ట్విట్టర్ ద్వారా చాటింపేసేశారామె. దుబాయ్‌కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఎమిరేట్స్ కోర్టులో వీణా పెళ్లి జరిగిందని సమాచారం. భగవంతుడి దయవల్ల పెళ్లి తంతు ముగిసిందని, త్వరలోనే పూర్తి స్థాయి పెళ్లి వేడుకను జరుపుకుంటానని, అలాగే... మక్కా యాత్రకు కూడా వెళ్లనున్నామని వీణా ట్వీట్ చేశారు.
వీణామాలిక్ అంటే... వివాదాలకు కేంద్రబిందువు. ‘బిగ్ బాస్ 4’ గేమ్ షోలో పాల్గొని అనేక వివాదాలతో ముద్దుగుమ్మ వెలుగులోకొచ్చింది. హిందీ నటుడు అస్మిత్ పటేల్‌తో సాహచర్యం, ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్‌పై నగ్న ప్రదర్శన... ఇవన్నీ వీణాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేశాయి. ‘డర్టీ పిక్చర్’ సినిమాలోని స్పెషల్‌రోల్‌తో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు వీణా. ప్రస్తుతం ఈ పాకిస్తానీ సుందరి ఓ తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు. వీణామాలిక్ పెళ్లివార్త... ఆమెను ఇష్టపడే యువతకు నిజంగా చేదు వార్తే.
Advertisement
Advertisement