వెంకటేశ్
హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఓ మై గాడ్’ చిత్రం తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ కానుంది. హిందీ వెర్షన్‌లో అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుని పాత్రను తెలుగులో విక్రమ్ చేయబోతున్నారని ఫిలింనగర్ సమాచారం. ‘తడాఖా’ ఫేమ్ డాలీ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు మరో నిర్మాతతో కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నారట.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో దూసుకొచ్చిన నవ దర్శకుడు మేర్లపాక గాంధీ. ఆయన రెండో చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. కథ సిద్ధమైంది. ఓ ఎనర్జిటిక్ యంగ్ హీరో ఇందులో నటించబోతున్నారు. త్వరలోనే చిత్రీకరణ మొదలుకానుంది.