
ఇప్పుడు పాక్‌లో!
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. తెలుగులో ‘అంకురం’ చిత్రంలో నటించిన ఆయన కన్నడ, పంజాబీ చిత్రాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేశారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో ఓంపురి తొలిసారి ‘న మాలూమ్ అఫ్రాద్’, ‘యాక్టర్ ఇన్ లా’ అనే రెండు పాకిస్థానీ చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.