ట్రంప్పై ప్రియాంక ఘాటు విమర్శ | Priyanka Chopra Slams Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్పై ప్రియాంక ఘాటు విమర్శ

Published Wed, Apr 27 2016 1:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ట్రంప్పై ప్రియాంక ఘాటు విమర్శ - Sakshi

ట్రంప్పై ప్రియాంక ఘాటు విమర్శ

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత, ఇటీవల భారతీయుల భాషను వక్రీకరించిన డోనాల్డ్ ట్రంప్ను బాలీవుడ్ నటి, ప్రస్తుతం హాలీవుడ్ లో సైతం దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా విమర్శించారు. ముస్లింలను అమెరికాలోకి రానివ్వకుండా నిషేధం విధించాలని ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అది ఆదిమ సంస్కృతి అన్నారు.

అమెరికాలో ప్రస్తుతం తీవ్ర వాదం సమస్యపైనే నడుస్తున్న క్వాంటికో అనే టీవీ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆమె 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్రవాదం అంశంపై తెరపైకి బాగా వచ్చిందన్నారు. ముస్లింలపై నిషేధం అనే వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ 'ఎవరిపైనా నిషేధం విధించకూడదని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి ఓ వర్గానికి చెందిన వ్యక్తులపైనే అలాంటి పనులు చేయడం అనేది ఆదిమ చర్య. ఉగ్రవాదాన్ని అంతమొందించడం అనేది క్లిష్టమైన సమస్య. దాన్ని ఏ ఒక్కరికో అపాధించడం ఏమాత్రం భావ్యం కాదు' అని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement