హాలీవుడ్‌కు మరో హిందీ తార? | Huma Qureshi to play Tom Cruise's leading lady in The Mummy? | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కు మరో హిందీ తార?

Published Tue, Apr 26 2016 10:30 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హాలీవుడ్‌కు మరో హిందీ తార? - Sakshi

హాలీవుడ్‌కు మరో హిందీ తార?

ఏ క్షణానైతే ప్రియాంకా చోప్రా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారో చాలామంది హిందీతారలు ఒక్క చాన్స్ అంటూ హాలీవుడ్ వెంటపడుతున్నారు. దీపికా పదుకొనే ఇప్పటికే ‘ఏజెంట్ త్రిబులెక్స్’ సీక్వెల్ ‘రిటర్న్ ఆఫ్ ద గ్జాండర్ కేజ్’ చిత్రంతో బిజీ అయిపోయారు. ఇప్పుడా  జాబితాలో ‘గాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘డి-డే’, ‘బద్లాపూర్’ ఫేమ్ హ్యూమా ఖురేషి చేరే అవకాశం ఉందట. 1999లో వచ్చిన సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్ సిరీస్ ‘మమ్మీ’ని ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్‌క్రూజ్ హీరోగా మళ్లీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు. బాలీవుడ్ కథానాయిక హ్యూమా కూడా వీటికి హాజరయ్యార ట. ఫైనల్‌గా హ్యూమాను కథానాయికగా ఎంపిక చేసే అవకాశం  ఉందని హిందీ వర్గాలు అనుకుంటున్నాయి. మరి హ్యూమా ఖురేషిని ఆ గోల్డెన్ చాన్స్ వరిస్తుందో లేదో కాలమే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement