మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన మహర్షి చిత్ర టీంకు అభినందనలు తెలిపారు. హీరో మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లిలను ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై స్పందించిన మహేష్ బాబు, వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ అభినందన నాకు వ్యక్తిగంతంగానే కాదు, మా చిత్ర యూనిట్‌కు కూడా ఎంతో గౌరవం, మీ ప్రశంసలు మరిన్ని ఇలాంటి చిత్రాలు చేసేందుకు ప్రేరణ కలిగించిం’ అంటూ మహర్షి టీం తరువాత కృతజ్ఞతలు తెలియజేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ మూవీ మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. టాక్ పరంగా నిరాశపరిచిన కలెక్షన్ల పరంగా మాత్రం మహర్షి సంచలనాలు నమోదు చేస్తోంది.
Sir.. This is such an honour for me personally & our whole team... it can't get better than this. Thank you Sir, your words have inspired us to keep doing more films like "Maharshi".. on behalf of Team Maharshi... humbled, Sir. 🙏🙏🙏 https://t.co/ML50Cf6QgJ
— Mahesh Babu (@urstrulyMahesh) 14 May 2019
Comments
Please login to add a commentAdd a comment