బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ ఈ రోజు(మే 16) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. శనివారంతో విక్కీ 33వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ శుభ సందర్భంగా నటుడికి సెలబ్రిటీలు, అభిమానుల నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. 2015లో నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వచ్చిన మసాన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి ఆరంభాన్ని అందించగా కేన్స్ యఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు అవార్డులను అందుకుంది. ఇదే జోష్‌లో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఉరి: ది సర్జికల్ స్ల్రైక్‌లో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
(ప్రియాంక లగ్జరీ విల్లా ఎలా ఉందో చూశారా )
కుర్ర హీరో పుట్టిన రోజు సందర్భంగా విక్కీ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు పట్టలేకపోతున్నారు. ఈ ఫోటోలలో తన చాకొలెట్ లుక్స్ ప్రతి ఒక్కరి మనుసు దోచుకుంటున్నాయి. ముఖంపై చెరగని చిరునవ్వ..ముసిముసి నవ్వలు పలుకుతున్నాయి. చిన్నప్పుడు, ఇప్పుడు ఒకేలా, అందంగా, క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక విక్కీకి అబ్బాయిల కంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (కరోనా : చైనాను దాటిన భారత్ )
Comments
Please login to add a commentAdd a comment