
గీతగోవిందం మూవీతో హిట్ పెయిర్‌గా నిలిచారు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్న. గీతగా నటించి మెప్పించిన రష్మిక.. ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో డియర్‌కామ్రేడ్ మూవీ రాబోతోన్నసంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్‌తో హీట్ పెంచేసిన చిత్రయూనిట్.. ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్‌చేయబోతోంది.
రేపు (ఏప్రిల్ 8) ఉదయం 11:11 గంటలకు ఈ మూవీలోని మొదటిసాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నీ నీలికన్నుల్లోనా.. అంటూ సాగే ఈ పాట దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. ఇప్పటికే ఈ పాటను కొన్ని వేలసార్లు విన్నాను అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. స్టూడెంట్ లీడర్ పాత్రలో విజయ్ నటిస్తుండగా.. క్రికెటర్‌గా లిల్లీ పాత్రలో రష్మిక మందాన్న నటిస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు.
I've heard this song a hundred times. Yet, I cannot stop ☺
— Vijay Deverakonda (@TheDeverakonda) April 7, 2019
And tomorrow you'll all get to hear this lovely song with an even more amazing lyrical video.
Tomorrow begins the launch of a music album that'll be remembered for a long long time. #DearComrade pic.twitter.com/ySH0LrfIlC
Comments
Please login to add a commentAdd a comment