
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తిరుగులేని ఫామ్‌ను సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ. ఈ మూవీ తరువాత ఈ యువ హీరో నటించిన మరేతర చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. విజయ్ ప్రస్తుతం ‘గీతాగోవిందం’తో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘టాక్సీవాలా’ సినిమా కూడా రెడీగా ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ఇక విజయ్ తన తదుపరి చిత్రం ‘డియర్ కామ్రెడ్’ను కూడా ప్రారంభించేశారు.
యంగ్ & మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం (ఆగస్ట్ 6) మొదలైంది. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
#DearComrade starts rolling 😊 @TheDeverakonda | @iamRashmika | #BharatKamma pic.twitter.com/VTsC3QNhfO
— Mythri Movie Makers (@MythriOfficial) August 6, 2018