
లెజండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం మహానటి. ఈ సినిమాలో కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మహానటి సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ఫొటోను విజయ్ దేవరకొండ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘వాట్ ఏ కూల్ చిక్’ #Mahanati అంటూ ఆ ఫొటోకు విజయ్ పెట్టిన కాప్షన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఒక లెజండరీ నటి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా.. సీనియర్లకి కాస్తైనా గౌరవం ఇవ్వు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘నేను నీకు పెద్ద అభిమానిని. కానీ ప్రస్తుతం నిన్ను ద్వేషిస్తున్నాను. ఒక గొప్ప నటి గురించి అలా ఎలా మాట్లాడగలవు’ అంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ విజయ్ క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు.
అయితే నెటిజన్ల కామెంట్లకు స్పందించిన విజయ్ తన పోస్ట్‌ని సమర్థించుకున్నాడు. ‘ఎవరికైతే క్షమాపణలు కావాలో వాళ్లంతా చెన్నై లీలా ప్యాలెస్‌లో ఉన్నా వచ్చేయండి. మహానటి ఆడియో లాంచ్ ఎంట్రీకి మిమ్మల్నితీసుకెళ్తా. ఆమెను ఆల్కహాలిక్, హోమ్‌బ్రేకర్ అంటూ మాట్లాడిన మీరు నా మాటల వల్ల బాధ పడుతున్నారా’ అంటూ వ్యంగంగా బదులిచ్చాడు.
What a cool chick.#Mahanati pic.twitter.com/8di3WUWXfZ
— Vijay Deverakonda (@TheDeverakonda) April 23, 2018
Comments
Please login to add a commentAdd a comment