
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ కోలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాడు. దీనిలో భాగంగానే నోటాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశాడు. అయితే ఈ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయినా విజయ్ మాత్రం.. కోలీవుడ్ మార్కెట్‌పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. నోటా తరువాత మరో ద్విభాషా చిత్రాన్ని చేయడానికి విజయ్ సిద్దమయ్యాడు.
విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బైలింగ్వల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడని సమాచారం. ఈ మూవీ టైటిల్‌పై ప్రస్తుతం ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ సరిపోతుందని యూనిట్ భావిస్తోందట. అయితే హీరో అనే టైటిల్ టాలీవుడ్‌కు కలిసిరాలేదు. చిరంజీవి, నితిన్‌లు ఈ టైటిల్‌తో సినిమాను తీసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసి ఉంటే.. ఈ టైటిల్‌తో విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment