విజయా సంస్థలో విక్రమ్‌? | Vikram is going to be a hero in Vijaya Productions. | Sakshi
Sakshi News home page

విజయా సంస్థలో విక్రమ్‌?

Published Fri, Sep 1 2017 3:16 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

విజయా సంస్థలో విక్రమ్‌? - Sakshi

విజయా సంస్థలో విక్రమ్‌?

తమిళసినిమా: విజయా ప్రొడక్షన్స్‌ సంస్థలో సియాన్‌ విక్రమ్‌ నటించనున్నారా? దీనికి కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే టాక్‌ వినిపోస్తోంది. ఎన్నో గొప్ప కళాఖండాలను భారతీయ సినీ ప్రేక్షకులకు అందించిన సంస్థ విజయాప్రొడ„క్షన్స్‌. ఎంజీఆర్‌ నుంచి ఇప్పటి విజయ్‌ వరకూ భారీ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఇటీవల నిర్మించిన చిత్రం భైరవా. కాగా ఈ సంస్థ అధినేతలు బి.వెంకటరామిరెడ్డి మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో సియాన్‌ విక్రమ్‌ హీరోగా నటించనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది.

విక్రమ్‌ ప్రస్తుతం విజయ్‌చందర్‌ దర్శకత్వంలో స్కెచ్‌ చిత్రాన్ని పూర్తి చేసి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ధృవనక్షత్రం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత హరి దర్శకత్వంలో సామి–2 చిత్రం చేయనున్నారు. తదుపరి కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. సూర్య హీరోగా అయన్, మాట్రాన్, ధనుష్‌తో అనేగన్, ఇటీవల విజయ్‌సేతుపతి కథానాయకుడిగా కవన్‌ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన కేవీ.ఆనంద్‌ ఇటీవల నటుడు విక్రమ్‌ను కలిసి కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంతో అందులో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు, ఈ చిత్రాన్ని విజయాప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement