
హిజ్రాగా విక్రమ్
నటుడు విక్రమ్ హిజ్రాగా నటిస్తున్నారు. ఇంతకు ముందు నటుడు శరత్‌కుమార్,రాఘవ లారెన్స్ కాంజన చిత్రంలో హిజ్రాలుగా నటించి ప్రశంసలు అందుకున్నారు.ఇప్పుడు నటుడు విక్రమ్ అలాంటి పాత్రలో న టిస్తున్నారు.10 ఎండ్రదుక్కుళ్ చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం ఇరుముగన్.
పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబూ తమీన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఆనంద్ శంకర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ మలేషియాలో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవషెడ్యూల్‌ను ప్రస్తుతం చెన్నైలోజరుపుకుంటోంది. ఇందులో విక్రమ్ ద్వీపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి రా ఏజెంట్ అధికారి పాత్ర కాగా మరొకటి హిజ్రా పాత్ర అని తెలిసింది.
ఈ పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్న విక్రమ్ ఇంతకు ముందు కందసామి చిత్రం కొన్ని సన్నివేశాల్లో స్త్రీగా కనిపంచారన్నది గమనార్హం. ఇరుముగన్ చిత్రం కోసం పూర్తి స్థాయి హిజ్రాగా మారుతున్నారట. ప్రస్తుతం రా ఏజెంట్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్‌లో విక్రమ్ పాల్గొనే భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు యూనిట్ వ ర్గాలు తెలిపారు..ఈ చిత్రం పై ఇప్పటికే పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొనడం విశేషం.