ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా | Vishal new movie goes on sets | Sakshi
Sakshi News home page

ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా

Published Sat, Sep 17 2016 12:03 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా

ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా

కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ యమా స్పీడు మీద ఉన్నాడు. నడిగర్ సంఘం కార్యకలాపాల్లో భాగం పంచుకుంటునే వరుసగా సినిమాలను కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కత్తిసండై సినిమాలో నటిస్తున్న విశాల్, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను మొదలుపెడుతున్నాడు. విశాల్ హీరోగాతెరకెక్కుతున్న కత్తి సండై దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది.

డిఫరెంట్ మూవీస్తో ఆకట్టుకుంటున్న మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాళన్ అనే సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాలో విశాల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ దర్శకుడు, నటుడు భాగ్యరాజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 23న ప్రారంభమవుతున్న ఈ సినిమాను విశాల్ తన సొంతం నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement