కామెడీ చిత్రంగా కత్తిసండై | Veteran comedian to join hands with Vishal for Kathi Sandai | Sakshi
Sakshi News home page

కామెడీ చిత్రంగా కత్తిసండై

Published Thu, Apr 7 2016 2:06 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

కామెడీ చిత్రంగా కత్తిసండై - Sakshi

కామెడీ చిత్రంగా కత్తిసండై

 నటుడు విశాల్ అదరగొట్టే యాక్షన్, వడివేలు కడుపుబ్బ నవ్వించే కామెడీతో కత్తిసండై అనే చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం మరుదు చిత్రంలో నటిస్తున్న విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి కత్తిసండై అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఇందులో హాస్య పాత్రలో నటుడు వడివేల్ నటించనున్నారు. ఈయన హీరోగా అవతారమెత్తిన తరువాత మళ్లీ హాస్యపాత్రలో నటించనున్న చిత్రం ఇదే అవుతుంది.
 
 ఇంతకు ముందు కామెడీ పాత్రలో నటించాల్సిందిగా చాలా మంది దర్శక నిర్మాతలు అడిగినా నటించని వడివేలు ఈ కత్తిసండై చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపడం ఆశ్చర్యమే. అయితే ఇంతకు ముందు విశాల్, వడివేలు కలసి తిమురు చిత్రంలో నటించారు. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకి కలసి నటించనున్నారు. ఇక ఈ చిత్రానికి సురాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తలైనగరం, మరుదమలై చిత్రాల్లో వడివేలు నటించారు.
 
 ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియోజూలియెట్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత ఎస్.నందగోపాల్ ప్రస్తుతం విక్రమ్‌ప్రభు హీరోగా వీరశివాజి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి విశాల్, విడివేలు కాంబినేషన్‌లో కత్తిసండై చిత్రాన్ని భారీ విలువలతో నిర్మించనున్నారు. ఇందులో నటించే హీరోయిన్ ఎంపిక జరుగుతోందంటున్న చిత్ర యూనిట్ ఈ నెలాఖరున కత్తిసండై చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇది సూపర్ యాక్షన్, కామెడీతో కూడిన పక్తు కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement