శంభో... ట్రైలర్‌ అదిరింది | Vishal Releases Shambo Sankara Movie 2nd Lyrical Song | Sakshi
Sakshi News home page

శంభో... ట్రైలర్‌ అదిరింది

Published Fri, Jun 1 2018 12:13 AM | Last Updated on Fri, Jun 1 2018 12:13 AM

Vishal Releases Shambo Sankara Movie 2nd Lyrical Song - Sakshi

శంకర్, విశాల్‌

శంకర్‌ హీరోగా శ్రీధర్‌ ఎన్‌. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శంభో శంకర’. ఆర్‌.ఆర్‌. పిక్చర్స్‌ సంస్థ, ఎస్‌.కె.పిక్చర్స్‌ సమర్పణలో వై.రమణా రెడ్డి, సురేశ్‌ కొండేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సెకండ్‌ సాంగ్‌ను హీరో విశాల్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  –‘‘ఫస్ట్‌ నాకీ సినిమా టైటిల్‌ బాగా నచ్చింది. ట్రైలర్‌ అదిరింది. గతంలో శంకర్‌ నటించిన రెండు మూడు సినిమాలు చూశాను.

అప్పటికీ ఇప్పటికీ తనలో చాలా చేంజ్‌ కనిపిస్తోంది. ఇప్పుడు రిలీజ్‌ చేసిన ఈ పాట చాలా నచ్చింది. సాయి కార్తీక్‌ మ్యూజిక్‌  బావుంది. సినిమా గ్యారెంటీగా హిట్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘విశాల్‌ గారు పాటను రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు శంకర్‌. శ్రీధర్‌ మాట్లాడుతూ – ‘‘విశాల్‌గారు రిలీజ్‌ చేసినది  హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌. భాను మాస్టర్‌ నేతృత్వంలో ఈ పాటను భారీగా చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత రమణా రెడ్డి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement