గర్ల్ ఫ్రెండ్స్ ను షేర్ చేసుకుంటాం! | We have shared everything, including girlfriends, says meet bros | Sakshi
Sakshi News home page

గర్ల్ ఫ్రెండ్స్ ను షేర్ చేసుకుంటాం!

Published Fri, Apr 1 2016 10:21 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

గర్ల్ ఫ్రెండ్స్ ను షేర్ చేసుకుంటాం! - Sakshi

గర్ల్ ఫ్రెండ్స్ ను షేర్ చేసుకుంటాం!

ముంబై: మీట్ బ్రదర్స్.. బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ కు ఆ పేరు సుపరిచితమే. మీట్ బ్రదర్స్ గా పేరుగాంచిన సోదరులు రిమిక్స్ పాటలతో హల్ చల్ చేస్తున్నారు. నిజానికి వీరు సోదరులు కానప్పటికీ మన్ మీత్ సింగ్, హర్మీత్ సింగ్ మీట్ బ్రోస్ గా మారి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుంటారు. బాలీవుడ్ లో వీరిదో వింతశైలి అని చెప్పవచ్చు. కొన్ని విషయాలలో మాత్రమే తమ నిర్ణయాలు వేరుగా ఉంటాయని, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా మేము షేర్ చేసుకున్నామని వారు అంటున్నారు. జీవితంలో ఏది శాశ్వతంగా ఉండవని అది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. వీరు ఎవరి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకోలేదట. జోగి సింగ్ బర్నాలా వీరి టాలెంట్ ను వెలుగులోకి తెచ్చాడు.

ఈ మీట్ బ్రదర్స్ ఆసక్తికర విషయాలను చెబుతున్నారు.  బేబీ డాల్, హై హీల్స్ లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న వీరు చాలా విషయాలలో ఒకే తీరుగా ప్రవర్తిస్తామని పేర్కన్నారు. వీరికి వ్యాపార నేపథ్యం కుటుంబం. ఓ బ్యాడ్ సింగర్ తమ కెరీర్ కు ఓ రూపునిచ్చాడని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి మేం ఇద్దరు స్నేహితులం. బ్రదర్స్ అవ్వాల్సిన పనిలేదని అభిప్రాయమని చెప్పారు. మన్మీత్ ఓపిక చాలా ఎక్కవని, తనకు కోపం త్వరగా వస్తుందని హర్మీత్ చెప్పుకొచ్చాడు. కాలేజీ రోజుల్లో మొత్తం 16 రకాల పేర్లను అనుకుని చివరగా మీట్ బ్రదర్స్ పేరు ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement