Baby Doll
-
కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!
‘కనేది ఆమె అయినా అతడికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టంగా మారింది. కాబట్టి ఈ రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాల్సిన పరిస్థితి. ఇలాంటి సరికొత్త ఆలోచనకు నాంది పలకక తప్పని పరిస్థితి. అందువల్ల మహిళలకు ఇచ్చినట్లే కాబోయే తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాల్సిందే. అయితే ఈ పెటర్నటీ సెలవులు ఉండి ఉన్నట్లుగా ఉన్నాయంతే. చాలా కంపెనీలు సరిగా ఇవ్వనే ఇవ్వడం లేదు. ఈ విషయమై లండన్‌లో పెద్ద ఎత్తున అసంతృప్తి నిరసనల రూపంలో వ్యక్తమవుతోంది. యూకే అంతటా పురుషుల విగ్రహాలు బేబీ క్యారియర్ల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఓ చిన్న శిశువు బొమ్మ పురుషుడి మెడకు చుట్టి ఉంచినట్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలు ప్రపంచమంతటా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అందుకు కారణం పెటర్నటీ సెలవులు. కాబోయే తండ్రులకు సెలవులు ఇవ్వాలని చెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ది డాడ్ షిఫ్ట్ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అంతేగాదు కుటుంబంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం అనే విషయంపై అంతా దృష్టి సారించేలా ఈ విధంగా చేస్తున్నారు అక్కడ. పితృత్వ సెలవులు ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?, వారి పాత్ర కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? అని నొక్కి చెప్పేలా అడుగడుగున ఇలాంటి పురుష విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ప్రజలు. అంతేగాదు నిరసనకారులు తమ అభ్యర్థనలతో యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్‌కు బహిరంగ లేఖను కూడా అందించారు. నిజానికి యూకే రెండు వారాల పితృత్వ సెలవును అందిస్తుంది. అంతేగాక వారానికి సుమారు రూ. 20,300 చెల్లిస్తోంది కూడా. అయితే బెల్జియం వంటి యూరోపియన్ దేశాలు మాత్రం ఈ పెటర్నటీ సెలవల్ని 20 రోజులకు పెంచింది. అంటే..యూరోపియన్ పార్లమెంట్ ఆదేశాల ప్రకారం ఫిన్లాండ్లో తల్లిదండ్రులిద్దరికీ 160 రోజులు వేతనంతో కూడిన సెలవులందిస్తోంది. అయితే మన భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు పితృత్వ సెలవులపై తప్పనిసరి చట్టం లేదు. కానీ 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) నిబంధనల ప్రకారం, పురుష ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజుల పితృత్వ సెలవులకు అర్హులు. ఈ విషయంపై ఇదివరకటి రోజల్లో అంతగా ప్రామఖ్యత లేదు. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సెలవులు తప్పనిసరి అని చెప్పొచ్చు. కాన్పు సమయంలో అమ్మ కాబోతున్న మహిళల్లో సైతం ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఇప్పుడూ ఎవరికీ వారే అనే యమునా తీరే అన్నట్లుగా న్యూక్లియర్ ఫ్యామిలీలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటప్పుడూ భర్త తోడు ఉండాలి. దీనివల్ల తండ్రిగా తన బాధ్యతలను ఎలా పంచుకోవాలో తెలియడమే గాక ఓ కొత్త బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.(చదవండి: మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్ మన్రో జీవితం..!) -
గర్ల్ ఫ్రెండ్స్ ను షేర్ చేసుకుంటాం!
ముంబై: మీట్ బ్రదర్స్.. బాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ కు ఆ పేరు సుపరిచితమే. మీట్ బ్రదర్స్ గా పేరుగాంచిన సోదరులు రిమిక్స్ పాటలతో హల్ చల్ చేస్తున్నారు. నిజానికి వీరు సోదరులు కానప్పటికీ మన్ మీత్ సింగ్, హర్మీత్ సింగ్ మీట్ బ్రోస్ గా మారి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తుంటారు. బాలీవుడ్ లో వీరిదో వింతశైలి అని చెప్పవచ్చు. కొన్ని విషయాలలో మాత్రమే తమ నిర్ణయాలు వేరుగా ఉంటాయని, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్స్ ను కూడా మేము షేర్ చేసుకున్నామని వారు అంటున్నారు. జీవితంలో ఏది శాశ్వతంగా ఉండవని అది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. వీరు ఎవరి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకోలేదట. జోగి సింగ్ బర్నాలా వీరి టాలెంట్ ను వెలుగులోకి తెచ్చాడు. ఈ మీట్ బ్రదర్స్ ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. బేబీ డాల్, హై హీల్స్ లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న వీరు చాలా విషయాలలో ఒకే తీరుగా ప్రవర్తిస్తామని పేర్కన్నారు. వీరికి వ్యాపార నేపథ్యం కుటుంబం. ఓ బ్యాడ్ సింగర్ తమ కెరీర్ కు ఓ రూపునిచ్చాడని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మేం ఇద్దరు స్నేహితులం. బ్రదర్స్ అవ్వాల్సిన పనిలేదని అభిప్రాయమని చెప్పారు. మన్మీత్ ఓపిక చాలా ఎక్కవని, తనకు కోపం త్వరగా వస్తుందని హర్మీత్ చెప్పుకొచ్చాడు. కాలేజీ రోజుల్లో మొత్తం 16 రకాల పేర్లను అనుకుని చివరగా మీట్ బ్రదర్స్ పేరు ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు. -
‘పెద్దల’ కామెడీగా...
‘‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ‘బేబీ డాల్’ చిత్రం షూటింగ్ చేస్తున్నాం. ప్రేయసి ఎలా ఉండాలనేదానిపై ప్రతి అబ్బాయికీ కొన్ని ఆలోచనలుంటాయి. యువతకు నచ్చేలా అడల్ట్ కామెడీగా దీన్ని రూపొందిస్తున్నాం’’ అని దర్శకురాలు హాసికా దత్ అన్నారు. మానస్ హీరోగా రైజింగ్‌సన్ ఫిలిమ్స్ పతాకంపై హాసికా దత్ హీరోయిన్గా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘బేబీ డాల్’ చిత్రాన్ని రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. ఆమె మాట్లాడుతూ, ‘‘నెల్లూరు, హైదరాబాద్‌లలో షూటింగ్ చేస్తున్నాం. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: మున్నా కాశీ. -
మెగాఫోన్ పట్టిన హాసిక దత్
సినీ దర్శకత్వాన్ని కొంచెం కష్టం కొంచెం సులభం అని అనవచ్చు. కొంచెం కష్టం అన్నది ఒకప్పుడు. కొంచెం సులభంగా ఇప్పుడు మారింది. అందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఒక కారణం కావచ్చు. చాలా మంది దర్శకత్వ శాఖలో పని చేయకుండానే మెగాఫోన్ పట్టి విజయాలు సాధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నారీమణులు దర్శకురాళ్లుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గతంలో దర్శకురాళ్లుగా రాణించి కథానాయికలు ఉన్నారు. ఇక ఇటీవల చూస్తే వడచెన్నై చిత్రంతో కృత్తిక ఉదయనిధిస్టాలిన్, పూవరసన్ పీపీ చిత్రంలో హలీత్‌సమీన్, మాలై నేరత్తు మయక్కం చిత్రంతో గీతాంజిలి సెల్వరాఘవన్ వంటి వారు మెగాఫోన్ పట్టారు. తాజాగా ఈ కోవలోకి వర్ధమాన కథానాయకి హాసికదత్ చేరారు. 1 బంతి 4 రన్స్ 1 వికెట్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బేబీడాల్ అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తారు. మరో పక్క నాయకిగానూ నటిస్తూ ద్వి బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ భామ మాట్లాడుతూ తనకు దర్శకత్వం అంటే చాలా ఆసక్తి అన్నారు. హీరోయిన్గా నటిస్తున్నా దర్శకత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని చెప్పారు. ఈ బేబీడాల్ చిత్రాన్ని ఎస్.రవిశంకర్ సమర్పణలో కుత్తూస్ బాషా నిర్మిస్తున్నారని తెలిపారు. మానస్ అనే నవ నటుడు కథానాయకుడు నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకులు సముద్రకని,కే.భాగ్యరాజ్,మొట్టై రాజేంద్రన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. హాస్యభరిత కథా చిత్రంగా తెకెక్కుతున్న ఈ బేబీడాల్ చిత్ర షూటింగ్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు హాసిక దత్ వెల్లడించారు.