‘పెద్దల’ కామెడీగా... | 'Beep Song' gets a huge challenge from 'Baby Doll' | Sakshi
Sakshi News home page

‘పెద్దల’ కామెడీగా...

Published Tue, Feb 2 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

‘పెద్దల’ కామెడీగా...

‘పెద్దల’ కామెడీగా...

‘‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ‘బేబీ డాల్’ చిత్రం షూటింగ్ చేస్తున్నాం. ప్రేయసి ఎలా ఉండాలనేదానిపై ప్రతి అబ్బాయికీ కొన్ని ఆలోచనలుంటాయి. యువతకు నచ్చేలా అడల్ట్ కామెడీగా దీన్ని రూపొందిస్తున్నాం’’ అని దర్శకురాలు హాసికా దత్ అన్నారు. మానస్ హీరోగా రైజింగ్‌సన్ ఫిలిమ్స్ పతాకంపై హాసికా దత్ హీరోయిన్‌గా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘బేబీ డాల్’ చిత్రాన్ని రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. ఆమె మాట్లాడుతూ, ‘‘నెల్లూరు, హైదరాబాద్‌లలో షూటింగ్ చేస్తున్నాం. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాఘవ నూలేటి, సంగీతం: మున్నా కాశీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement