ఈవెంట్ హోస్ట్ కు షాకిచ్చిన హీరోయిన్! | what ever priyanka do is fine compare to Deepika, says Sonam | Sakshi
Sakshi News home page

ఈవెంట్ హోస్ట్ కు షాకిచ్చిన హీరోయిన్!

Published Thu, Oct 13 2016 5:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఈవెంట్ హోస్ట్ కు షాకిచ్చిన హీరోయిన్! - Sakshi

ఈవెంట్ హోస్ట్ కు షాకిచ్చిన హీరోయిన్!

ముంబై: ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీ బాట పట్టిన హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె. ప్రియాంక మాత్రం ఇప్పటికే అమెరికా టీవీ సిరీస్ షో తో అంతర్జాతీయ స్టార్ గా మారింది. దీపికా ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో ఓనమాలు నేర్చుకుంటోంది. ఎంతైనా ప్రియాంక ఓ ఆకు ఎక్కువ చదివినట్టే చెప్పవచ్చు. ఈ ఇద్దరు తారలపై మరో ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ స్పందించింది. ముక్కు సూటిగా మాట్లాడే అతికొద్దిమంది హీరోయిన్లలో ఒకరైన సోనమ్ ఓ సందర్భంలో దీపికా, ప్రియాంక.. వీరిలో బెస్ట్ అని అడగ్గానే స్పందించిన ఈ బ్యూటీ ఠక్కున ప్రియాంక పేరు చెప్పేసింది.

అసలు విషయం ఏంటంటే.. నేహా ధుపియా నిర్వహించే కార్యక్రమం 'నో ఫిల్టర్ నేహా'లో సోనమ్ పాల్గొంది. ఈ సందర్భంగా ఫెవరెట్ హీరోయిన్ దీపికానా.. లేక ప్రియాంకనా అని నేహా అడిగింది. మాజీ ఫ్రెండ్ దీపికా పేరు చెబుతుందని ఊహించిన అందరికీ సోనమ్ షాకిస్తూ.. ప్రియాంకకే ఓటేసింది.  ప్రియాంక మ్యానరిజం ఏదైనా తనకు నచ్చుతుందని చెప్పిన సోనమ్.. మరోనటి బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ పై కూడా కామెంట్ చేసింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో కంగనా ఎక్కువగా హై హీల్స్ వాడుతుందని, ఈ విషయంలో కాస్త ఆమె తీరు మార్చుకోవాలని ఏ మోహమాటం లేకుండా సోనమ్ చెప్పేసింది. అడిగిన ప్రశ్నలతో పాటు ప్రస్తావించని హీరోయిన్లపై ఈ బ్యూటీ కామెంట్లు చేయడంతో ఈవెంట్లో పాల్గొన్నవారితో పాటు ఈవెంట్ హోస్ట్ నేహా ధుపియా ఆశ్చర్యానికి లోనైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement