
అవును. వాట్ నెక్ట్స్? అని మూడు నెలలుగా రకుల్ గురించి చాలామంది మనసులో ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు దాదాపు సమాధానం దొరికినట్లే. ‘స్పైడర్’ సినిమా రిలీజ్ అయి మూడు నెలలు కావొస్తున్నా రకుల్ తెలుగులో నెక్ట్స్ సినిమా ఇంకా సైన్ చేయలేదేంటి? అన్నదే ఆ ప్రశ్న. ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తోన్న రకుల్ ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారట. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.
ఇందులో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. డాక్టర్‌కు జోడీగా.. అదేనండి నాని సరసన హీరోయిన్‌గా రకుల్ చేయనున్నారట. ‘స్పైడర్’లో డాక్టర్‌గా చేసిన రకుల్ ఈ సినిమాలో డాక్టర్‌కి జోడీగా యాక్ట్ చేస్తారన్న మాట. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment