
చూడండి... పూర్తిగా మగాడిలా మారిన శృంగారతార సన్నీ లియోన్ (ఇన్‌సెట్ ఫొటోలో)ని చూడండి! మీసాలు... గడ్డాలు... హిమేశ్ రేషమియా (హిందీ సంగీత దర్శకుడు) హెయిర్ స్టయిల్... బ్లాక్ జాకెట్... ఎవరో రాక్‌స్టార్‌లా కనిపిస్తున్నది సన్నీ లియోనే! రాజీవ్ వాలియా దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమా ‘తేరా ఇంతిజార్’లో కథ ప్రకారం కొన్ని సన్నివేశాల్లో సన్నీ లియోన్ మగాడిలా కనిపించాలట! ఆదివారం ఆ సన్నివేశాల్ని చిత్రీకరించారు. మేకప్ ఆర్టిస్టులు, సన్నీ టీమ్ చాలాసేపు కష్టపడితే... మీరు చూస్తున్న లుక్ వచ్చింది.
ప్రొస్థేటిక్ మేకప్‌తో సన్నీని మగాడిలా మార్చారు. ఈ తతంగమంతా పూర్తయిన తర్వాత ‘మగాడిలా మారడం కష్టమే’ అని సన్నీ వ్యాఖ్యానించారు. ‘‘ఈ లుక్‌లో నన్ను నేను చూసుకుంటే... మా డాడీలా, బ్రదర్‌లా ఉన్నాను (ఐ జస్ట్ లుక్ లైక్ మై డాడ్ అండ్ బ్రదర్) క్రేజీ!’’ అని సన్నీ లియోన్ కామెంట్ చేశారు. పాపం... సన్నీ అభిమానులకు ఈ లుక్ అంతగా కిక్ ఇస్తుందో? లేదో? ఎందుకంటే... ఆమె ఎక్కువగా హాట్ హాట్ క్యారెక్టర్స్‌లోనే కనిపించాలని వాళ్లు కోరుకుంటారు కదా!!
Comments
Please login to add a commentAdd a comment