
నవరస అనే పేరుతో మొదటిసారి విభిన్న దర్శకుడు మణిరత్నం ఓటీటీ ఫ్లాట్‌ఫ్లాంలో అడుగు పెట్టబోతున్నారు. నవసర పేరిట తొమ్మిది ఎపిసోడ్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇందులో ప్రతి ఎపిసోడ్‌కు ఒక డైరెక్టర్ దర్శకత్వం వహించనుండగా, ఒక్కో హీరో నటించనున్నారు. ఇప్పటికే దర్శకులుగా నటులు అరవింద్ స్వామి, సిద్ధార్థ్ లతో పాటు గౌతం మీనన్, బిజోయ్ నంబియార్, సుధ కొంగర, కేవీ ఆనంద్, జయేంద్ర, కార్తీక్ నరేన్ ఎంపికయ్యారు. ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి తమిళ సినీ పరిశ్రమ నుంచి సూర్య, మాధవన్ ఎంపిక కాగా ఇక తెలుగు పరిశ్రమ నుంచి నాగార్జున, నాని, నాగ చైతన్యలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్‌సిరీస్‌ను ఆగస్టు నుంచి మొదలు పెట్టే ఆలోచనాలో మణిరత్నం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మణిరత్నం స్కిప్ట్‌ను మాత్రమే మానిటర్ చేస్తారా లేక ఏదైనా ఎపిసోడ్‌ను డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
చదవండి: గొప్పగా నటించమని వేడుకుంటా: మణిరత్నం
Comments
Please login to add a commentAdd a comment