
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్‌ను, ఎన్టీఆర్ లుక్‌ను కూడా రివీల్‌చేసింది చిత్రబృందం. వీటికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చస్తోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా కోసం ఎన్టీఆర్, కాజల్ చేసిన ‘పక్కాలోకల్’ ఐటం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు త్రివిక్రమ్ కూడా ఆసక్తిని చూపిస్తున్నాడట. ఇక ఇదే నిజమైతే... ఎన్టీఆర్, కాజల్ కలిసి మళ్లీ స్టెప్పులేస్తారన్నమాట. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది. రాయలసీయ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment