సాధారణంగా ఏదైనా ఓ చిత్రంలో నాలుగు నుంచి ఆరు పాటలుంటాయి. కానీ ‘జమ్స్’ అనే చిత్రంలో 24 పాటలుంటాయట.
సాధారణంగా ఏదైనా ఓ చిత్రంలో నాలుగు నుంచి ఆరు పాటలుంటాయి. కానీ ‘జమ్స్’ అనే చిత్రంలో 24 పాటలుంటాయట. ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.కేశవ్ దర్శకత్వంలో బి.చంద్రాయుడు, ఎస్‌ఎస్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘లిరిక్స్ అద్భుతంగా వచ్చాయి. 24 పాటలతో 240 మంది డ్యాన్సర్లతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.రాజ్‌కిరణ్.