డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డైరెక్టర్ ఎంగేజ్‌మెంట్
డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డైరెక్టర్ ఎంగేజ్‌మెంట్
Published Sun, Aug 27 2017 8:58 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM
హైదరాబాద్: టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాల మనవరాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ వీణా ఘంటసాల నిశ్చితార్థం చేసేసుకుంది. క్షణం చిత్ర దర్శకుడు రవికాంత్ పెరెపుతో కాబోయే వరుడు కావటం విశేషం. ఆగష్టు 12న చెన్నైలో కొంత మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగినట్లు సమాచారం.
ఘంటసాల తనయుడు, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటుడు అయిన ఘంటసాల రత్నకుమార్ కూతురే వీణ. ఆమె కూడా పలు చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసింది. క్షణం సినిమాలో ఆదాశర్మకు డబ్బింగ్ చెప్పింది కూడా . ఆ సమయంలోనే రవికాంత్-వీణ మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత పెద్దలను ఒప్పించి వీరు ఎట్టకేలకు నిశ్చితార్థం చేసేసుకున్నారు. నవంబర్ 11న వీరి వివాహం ఘనంగా జరగనుంది.
ప్రస్తుతం తన రెండో చిత్రం కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో రవికాంత్ పెరెపు బిజీగా ఉన్నాడు. రానా హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement