బాంబే హైకోర్టు అసాధారణ తీర్పు.. రేప్ కేసు కొట్టివేత
న్యూఢిల్లీ : అత్యాచార కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు అసాధారణ తీర్పు వెలువరించింది. అత్యాచార బాధితురాలికి నిందితుడు రూ.10లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో చెల్లించడంతో రేప్ కేసును కొట్టేస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అయిన ఆమెకు, ఆమెకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నిందితుడు రూ.10 లక్షలు జాతీయ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం, ఇందుకు బాధితురాలు అంగీకరించడంతో కేసును కొట్టేస్తున్నట్లు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అమ్జద్ సయీద్‌ల హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
పదేళ్లకాల పరిమితి గల ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీని, కాల పరిమితి ముగిశాక డిపాజిట్ మొత్తాన్ని బాధితురాలు విత్‌డ్రా చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తి కనిపించకుండా పోయాడంటూ 23 ఏళ్ల బాధితురాలు ఈ ఏడాది పుణెలోని బంద్ గార్డెన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు పుణెకు చెందిన 30 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదుచేశారు. చివరికి తప్పు ఒప్పుకున్న నిందితుడు తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు.
రేప్ బాధితురాలికి 10 లక్షల పరిహారం
Published Thu, Jul 28 2016 2:43 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement