11 ఏళ్ల బాలుడికి ఐన్‌స్టీన్ అంత ఐక్యూ!
నాగ్‌పూర్ : అఖిలేశ్ చందోర్కర్ అనే 11 ఏళ్ల నాగపూర్ బాలుడికి ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ అంతటి ఇంటెలిజెంట్ కోషియంట్(ఐక్యూ) ఉందని మెన్సా జరిపిన పరీక్షలో తెలిసింది.ఇతని ఐక్యూ రికార్డు స్థాయిలో 160 ఉంది. ఇది ఐస్‌స్టీన్, హాకింగ్‌ల ఐక్యూతో సమానం. జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే అఖిలేశ్, విహారయాత్రకోసం కుటుంబంతో కలసి జూన్‌లో స్కాట్లాండ్ వెళ్లాడు. ఐక్యూ పరీక్ష మెన్సా రాశాడు. ‘నాకు 160 స్కోర్ వస్తుందని అనుకోలేదు. 140 స్కోర్ వస్తుందనుకున్నా. ఫలితాలకోసం ప్రతిరోజూ మెయిల్ చూసేవాడిని. కానీ మెన్సా నుంచి నాకు వింతగా సంప్రదాయ పోస్ట్ ద్వారా ఫలితాలు అందాయి’ అని అఖిలేశ్ చెప్పాడు.
మెన్సా పరీక్ష : ప్రపంచంలో అత్యధిక ఐక్యూగలవారు సభ్యులుగా ఉండే మెన్సా ఇంటర్నేషనల్ ఎన్జీవో ఈ పరీక్ష నిర్వహిస్తుంది. దీన్ని ఆన్‌లైన్‌లో రాయొచ్చు. పరీక్షలో అత్యధిక ఐక్యూ సాధించిన తొలి రెండు శాతం మందికి మెన్సా సభ్యత్వం ఇస్తారు.