11 ఏళ్ల బాలికపై అత్యాచారం
11 ఏళ్ల బాలికపై అత్యాచారం
Published Mon, Sep 4 2017 12:45 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ 11 ఏళ్ల బాలికపై ఆమె తల్లి, అన్న ముందే దుండగులు అత్యాచారం జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత బుధవారం బాలిక ఆమె తల్లి, టీనేజ్ అన్నయ్యతో నిద్రిస్తుండగా రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆ బాలికపై అత్యాచారం జరిపారు. ఇద్దరు గన్‌తో బాలిక తల్లి, అన్నను బెదిరించగా మూడోవాడు అత్యాచారం జరిపాడు. అనంతరం బాలిక తల్లి, అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్యాచారం జరిపింది జాన్వర్ సింగ్ (36) గా, సహాకరించింది రాజు కుశ్వహా(25) , రామ్‌నీవాస్(24) పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గుర్ని గత రాత్రి అదుపులోకి తీసుకున్నామని, పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గ్వాలియర్ బిజోలి పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతొందని, బాలికను వైద్యపరీక్షలకు పంపించామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement