కోరాపుట్ (ఒడిశా): జనజీవన స్రవంతిలో కలవాలనే ఆకాంక్షతో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పోలీసుల ఎదుట ఆదివారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రత్యేక జోనల్ కమిటీ ఆధ్వర్యంలోని శ్రీకాకుళం-కోరాపుట్ డివిజన్ కమిటీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారు కోరాపుట్ జిల్లా నారాయణపట్న నివాసులని వెల్లడించారు.
వీరు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించడమే కాకుండా మావోలకు సమాచార వ్యవస్థను రూపొందించేవారని చెప్పారు. ఈ 12మందితో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో మొత్తం 33 మంది మావోలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులందరూ హింసను విడనాడి జనజీవనస్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిచ్చారు.
కోరాపుట్‌లో 12 మంది మావోల లొంగుబాటు
Published Mon, Jun 9 2014 1:56 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement