'పచౌరీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు'
తేరి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్‌కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. తేరిలో గతంలో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి పట్ల పచౌరీ అసభ్యంగా ప్రవర్తించారని, ఆమె గౌరవానికి భంగం కలిగించారని ఆయనపై ఆరోపణలున్నాయి.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ వద్ద 1400 పేజీలతో కూడిన ఈ చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. తేరిలో ప్రస్తుతం పని చేస్తున్న, గతంలో పనిచేసిన ఉద్యోగులలో సుమారు 23 మందిని పోలీసులు ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులుగా పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 354, 354 ఎ, 354 డి, 506, 509 కింద పచౌరీపై ఆరోపణలు నమోదయ్యాయి.