rk Pachauri
-
‘టెరి’ వ్యవస్థాపక డైరెక్టర్ ఆర్కే పచౌరి మృతి
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త, ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(టెరి)’ మాజీ చీఫ్ ఆర్కే పచౌరి(79) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. ‘టెరి’కి వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. ఢిల్లీలోని ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో మంగళవారం పచౌరికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. లైంగికంగా వేధించారని ఒక సహ ఉద్యోగిని ఆరోపణలు చేయడంతో 2015లో ‘టెరి’ నుంచి పచౌరి వైదొలిగారు. ‘టెరి’కి పచౌరి అందించిన అనుపమాన సేవలను సంస్థ చైర్మన్ నితిన్ దేశాయి ఒక ప్రకటనలో కొనియాడారు. 1974లో ‘టెరి’ని స్థాపించారు. విద్యుత్, పర్యావరణం, సమ్మిళిత అభివృద్ధి రంగాల్లో ఈ సంస్థ కృషి చేస్తోంది. -
పచౌరీపై అభియోగాలు మోపండి
న్యూఢిల్లీ: టెరీ (భారత్‌లో విద్యుత్, పర్యావరణం, సహజ వనరులపై పరిశోధనలు చేసే సంస్థ) మాజీ చీఫ్ ఆర్కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అభియోగాలు మోపాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యంగా వ్యవహరించడం), 354 (ఏ) (శారీరకంగా తాకేందుకు ప్రయత్నించడం), 509 (వేధించడం, అసభ్య పదజాలం, అసభ్య చేష్టలకు పాల్పడటం) కింద అభియోగాలు నమోదు చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చారు గుప్తా ఆదేశించారు. 2015, ఫిబ్రవరి 13న టెరీ మాజీ ఉద్యోగి ఒకరు తనతో పచౌరీ అసభ్యంగా ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మార్చి 21న పచౌరీకి ముందస్తు బెయిల్ మంజూరైంది. 2016 మార్చి 1న ఢిల్లీ పోలీసులు 1,400 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. -
నేను అమాయకుడిని.. కోర్టుపై నమ్మకముంది!
న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరి తాజాగా స్పందించారు. ఈ కేసులో తాను అమాయకుడినని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఆయనపై పోలీసులు నమోదుచేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకుసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెరి మాజీ చీఫ్ అయిన పచౌరి స్పందిస్తూ 'చార్జీషీట్లోని అభియోగాలను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకానీ నాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఎక్కడా పేర్కొనలేదు. ఫిర్యాదుదారు చేసిన అభియోగాలపై ఏడాది పాటు సాగిన విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడి కాలేదు' అని పేర్కొన్నారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసముందని, తాను ఏ తప్పు చేయలేదని, అదే విషయం కోర్టు తీర్పు ద్వారా రుజువు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై పచౌరి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 2015లో బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయి!
న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకుసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. పచౌరిపై చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివానీ చౌహాన్ ఈ కేసు విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై పచౌరి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 2015లో బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
'పచౌరీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు'
తేరి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్కే పచౌరీపై లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. తేరిలో గతంలో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి పట్ల పచౌరీ అసభ్యంగా ప్రవర్తించారని, ఆమె గౌరవానికి భంగం కలిగించారని ఆయనపై ఆరోపణలున్నాయి. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ వద్ద 1400 పేజీలతో కూడిన ఈ చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. తేరిలో ప్రస్తుతం పని చేస్తున్న, గతంలో పనిచేసిన ఉద్యోగులలో సుమారు 23 మందిని పోలీసులు ప్రాసిక్యూషన్ తరఫు సాక్షులుగా పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 354, 354 ఎ, 354 డి, 506, 509 కింద పచౌరీపై ఆరోపణలు నమోదయ్యాయి. -
'చెత్తగా మాట్లాడాడు.. ముద్దుపెట్టుకోబోయాడు'
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే పచౌరీ గురించి కొన్ని అసభ్యకర విషయాలు తెలిశాయి. ఆయన చాలా అసభ్యకరంగా మాట్లాడేవారని, బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించేవారని ఆయన వద్ద పనిచేస్తున్న పరిశోధక విద్యార్థిని తెలిపింది. జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు స్వయంగా వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఆమె ఈ మాటలు చెప్పినట్లు సమాచారం. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(తెరి) డైరెక్టర్ జనరల్‌గా ఆర్కే పచౌరీ పని చేస్తున్న సమయంలో ఆయన దగ్గర పరిశోధక విద్యార్థిగా చేరిన ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ నమోదుచేసుకున్నారు. తొలిసారి రెండు రోజుల ఐదుగంటలపాటు మరోసారి 28గంటలపాటు ఆమె పచౌరీ చేష్టలపై వాంగ్మూలం ఇచ్చింది. 2014 మార్చి నెలలో మెక్సికోలోని లాస్ కాబోస్ కు క్లైమేట్ సమావేశం కోసం విమానంలో వెళుతున్న సమయంలో ఆయన తనను బెదిరించాడని, బాయ్ ఫ్రెండ్ కోసం ప్రయత్నిస్తే అతడి సంగతి తేలుస్తానంటూ కళ్లెర్రజేశాడని చెప్పింది. అదే రోజు తనను బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడాడని కూడా ఆమె వాంగ్మూలంలో చెప్పింది. -
ఎస్సెమ్మెస్‌లతో సహా 500 పేజీల చార్జిషీటు
న్యూఢిల్లీ: ది ఎనర్జీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 500 పేజీల చార్జిషీటును సిద్ధం చేసినట్లు అధికార వర్గాల సమాచారం. వీటిల్లో ఆయన పంపించిన మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు, కాల్ డేటా తదితరమైనవి చాలా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో తనపై లైంగిక వేధింపులకు ఆర్కే పచౌరీ పాల్పడ్డారంటూ ఆయన వద్ద రిసెర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న ఓ 29 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని విధాలుగా పరిశీలించిన వారు చివరకు భారీ మొత్తంలో 500 పేజీల చార్జిషీటును సిద్ధం చేసినట్లు తెలిసింది. -
బలవంతంగా పంపేశారు!
న్యూఢిల్లీ: సహోద్యోగినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్కే పచౌరిని టెరి నుంచి బలవంతంగా సెలవులో పంపించారు. ఆయన స్థానంలో నూతన చైర్మన్‌గా అశోక్ చావ్లాను టెరి పాలక మండలి ఎన్నుకుంది. అదేవిధంగా అజయ్ మాథుర్‌కు పూర్తి కార్యనిర్వహణ అధికారాలు కట్టబెడుతూ కౌన్సిల్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే పచౌరిని ఇంధన వనరుల సంస్థ (టెరి) చైర్మన్‌గా నియమిస్తూ తాజాగా పాలకమండలి నిర్ణయం తీసుకోవడం తీవ్ర దుమారం రేపింది. తన జూనియర్ సహ ఉద్యోగిని తీవ్రంగా లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పచౌరిపై కేసు నమోదుచేసిన ఆమె ప్రస్తుతం టెరికి రాజీనామా చేసింది. ఈ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన పచౌరీని తిరిగి టెరికి తీసుకురావడం తాజా వివాదానికి కారణమైంది. ఆయనపై మరో టెరి ఉద్యోగిని కూడా లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో టెరి వైస్ చైర్మన్‌గా నియమించిన పచౌరిని దీర్ఘకాలిక సెలవుపై బలవంతంగా పంపిస్తూ తాజాగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. -
'ఇలాంటి వాతావరణంలో నేనుండను'
న్యూఢిల్లీ: పర్యావరణ శాస్త్రవేత్త ఆర్కే పచౌరీపై లైంగిక ఆరోపణలు చేసిన పరిశోధకురాలు ఉద్యోగాన్ని వదిలేసింది. ఆమె ది ఎనర్జీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(తెరా)లో చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేసింది. అనంతరం ఆ సంస్థలోని ఉద్యోగులపై పలు ఆరోపణలు చేసింది. తనను కొంత మేధావి వర్గం చెప్పుకోలేని విధంగా చిన్న చూపు చూస్తున్నారని, ఒక ఉద్యోగినిగా తన ఇష్టాలను గుర్తించడంలో, గౌరవాన్ని కాపాడటంలో తెరా సంస్థ విఫలమైందని రాజీనామా లేఖలో వివరించింది. 'మీరు పచౌరీపై చర్యలు తీసుకునే బదులు ఆయనకు పూర్తిగా రక్షణ కల్పించారు. నేను చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మీరు స్వయంగా వేసిన కమిటీ కూడా తననే అవమానించేలా నివేదిక ఇచ్చింది. ఇక పాలక మండలి కూడా నన్ను ఊహించని విధంగా చిన్నబుచ్చింది. కనీసం ఆయనపై సస్పెండ్ వేటు వేసి చర్యలు కూడా తీసుకోలేదు. పైగా నేను ఇమడలేనంత వాతావారణాన్ని మీరు కావాలనే సృష్టించారు. అందుకే రాజీనామా చేస్తున్నాను' అంటూ ఆమె వాపోయింది. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పచౌరీ తనను లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు పరిశోధనకారిణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈమెయిల్స్, సంక్షిప్త సందేశాలు, వాట్సాప్ సందేశాల ద్వారా ఎంతో విసిగించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే వీటన్నింటిని అప్పుడు పచౌరీ ఖండించారు. తన మెయిల్స్, ఫోన్ నెంబర్స్ హ్యాక్ చేశారని చెప్పారు. -
ఆర్కే పచౌరి 'బాధితురాలు' రాజీనామా!
న్యూఢిల్లీ: ఇంధన వనరుల సంస్థ (టెరి) మాజీ డైరెక్టర్ ఆర్కే పచౌరిపై లైంగిక వేధింపుల కేసు నమోదుచేసిన మహిళా పరిశోధక నిపుణురాలు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. టెరి సంస్థ తనపట్ల అత్యంత ఘోరంగా ప్రవర్తించిందని, అందుకే సంస్థకు రాజీనామా చేస్తున్నానని 29 ఏళ్ల ఆమె రాజీనామా లేఖలో తెలిపారు. ఒక ఉద్యోగిగా తన ప్రయోజనాలకు టెరి మద్దతుగా నిలువలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టెరి డైరెక్టర్‌గా ఆర్కే పచౌరి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గత ఫిబ్రవరి 13న ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఏ), 354 (డీ) (వేధింపులు), 506 (క్రిమినల్ బెదిరింపులు) కింద అభియోగాలు మోపారు. దీంతో ఆర్కే పచౌరిని తొలగించి.. ఆయన స్థానంలో డాక్టర్ అజయ్ మధుర్‌ను సంస్థ డైరెక్టర్ జనరల్‌గా టెరి గవర్నర్ కౌన్సిల్ నియమించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆర్కే పచౌరి ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ నుంచి, వాతావరణ మార్పులపై ప్రధానమంత్రి మండలి నుంచి వైదొలిగారు. -
మార్చి 27వరకు పచౌరీని అరెస్టు చేయొద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ వేత్త ఆర్కే పచౌరీని మార్చి 27 వరకు చేయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (తెరి)లో పనిచేస్తున్న ఓ మహిళ తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రశ్నించేందుకు పోలీసులు బుధవారమే నోటీసులు కూడా పంపించారు. అయితే తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో అరెస్టునుంచి మార్చి 27 వరకు రక్షణ పొందారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) మంగళవారమే రాజీనామా కూడా చేశారు.