లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ వేత్త ఆర్కే పచౌరీని మార్చి 27 వరకు చేయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (తెరి)లో పనిచేస్తున్న ఓ మహిళ తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన ప్రశ్నించేందుకు పోలీసులు బుధవారమే నోటీసులు కూడా పంపించారు. అయితే తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. అనంతరం కోర్టును ఆశ్రయించడంతో అరెస్టునుంచి మార్చి 27 వరకు రక్షణ పొందారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) మంగళవారమే రాజీనామా కూడా చేశారు.