ట్రక్కు ఢీ..16 మంది మృతి..50 మందికి గాయాలు
Published Sun, Feb 26 2017 7:34 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
షిల్లాంగ్: మేఘాలయాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టడంతో దానిలో ఉన్న 16 మంది మృతి చెందగా 50 మంది పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పశ్చిమ కాశీ హిల్స్ జిల్లాలోని నాంగ్‌స్టోయిన్‌కు సమీపంలోని జ్దోక్రో గ్రామంలో చోటు చేసుకుంది.
అయితే 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు మీడియాకు తెలిపారు. మృతుల్లో 9 మంది మహిళలలు, ఓ బాలిక (13) ఉందన్నారు. ప్రమాద బాధితులు నాగలాండ్ గ్రామస్తులని, వీరంతా ప్రేస్బెటేరియన్ చర్చికి వెల్లోస్తున్నారుని చెప్పారు. క్షతగాత్రులను షిల్లాంగ్ సివిల్ ఆసుపత్రికి తరిలించామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement