
పెరిగిన ఈ-వీసా యాత్రికులు
కోల్‌కతా: ఈ-టూరిస్ట్ వీసా మీద భారత్‌ను సందర్శించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం 179.9 శాతం వృద్ధి నమోదైందని అసోచామ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ- టూరిస్ట్ వీసా ఆధారంగా ఈ మేలో 43,833 మంది సందర్శించగా, కిందటి సారి ఇదే సమయంలో 15,659 మంది వచ్చారు.
ఈ ఏడాది జనవరి-మే మధ్య 4,34,927 మంది ఈ సదుపాయం వినియోగించుకోగా, గత ఏడాది ఇదే కాలంలో 1,10,657 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఈ విధానాన్ని 2014 నవంబర్ 27 నుంచి 2016 ఫిబ్రవరి 25 వరకు 113 దేశాలకు చెందిన పౌరులకు భారత ప్రభుత్వం వర్తింపజేసింది.