లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ ఏడాది సెప్టెంబర్ 20 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. ‘లోక్‌సభ, శాసనసభల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది లోక్‌సభలో పెండింగ్‌లో ఉంది.
మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు, కోట్లాది భారతీయ మహిళల సమస్యలపై మహిళలు పార్లమెంటులో గళం ఎత్తేందుకు ఇది ఉపయోగపడుతుంది. 2014లో 15వ లోక్‌సభ కాలం ముగిసిన అనంతరం దీనికి కాలం చెల్లిపోయింది. కేంద్రం ఈ బిల్లును తెచ్చి మహిళా సాధికారత కోసం పాటుపడాలి’అని పేర్కొన్నారు.
మహిళా బిల్లుకు 20 ఏళ్లు..
Published Thu, Dec 15 2016 3:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
Advertisement
Advertisement