25మందిని కాటేసిన కల్తీ మద్యం | 25 Dead After Consuming Spurious Liquor in Mumbai | Sakshi
Sakshi News home page

25మందిని కాటేసిన కల్తీ మద్యం

Published Fri, Jun 19 2015 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

25 Dead After Consuming Spurious Liquor in Mumbai

ముంబయి: కాయాకష్టం చేసుకొని మురికి వాడల్లో బతికే అమాయక కూలీలను కల్తీమద్యం కాటేసింది. మత్తులో తూలడానికి తాగిన మద్యం వారి ప్రాణాలు తీసింది. ముంబయిలో కల్తీ మద్యం తాగి 25మంది ప్రాణాలు కోల్పోయారు. సుబర్బన్ మలాద్ వద్ద గల లక్ష్మీనగర్ మురికి వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వీరితోపాటు చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్య సహాయం పొందుతున్నారు. గత రాత్రి 7.30గంటల ప్రాంతంలో వారంతా మద్యం సేవించగా ఒక్కసారి అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే పలువురు మరణించారు. వీరందరిని శాతాబాయి, బీఎంసీ తదితర ప్రముఖ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మద్యం షాపు నడుపుతున్న రాజు లంగడా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement