
ముంబై : దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వీరిలో 12 మంది ఉన్నతాధికారులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన అధికారులతో కాంటాక్ట్ ఉన్న మిగతా పోలీసులను కూడా క్వారంటైన్‌కి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ముంబైలో దాదాపు 250 మంది పోలీసులకి కరోనా సోకిందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా 52 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా, 583 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment