ముంబై : దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా జెజె మార్గ్ పోలిస్ స్టేషన్‌కు చెందిన 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వీరిలో ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీరిలో 8 మందిలో కరోనా లక్షణాలు బయటపడలేవని, పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు సహా, 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవినాష్ ధర్మాధికారి తెలిపారు. (ముంబైలో ఒకేరోజు 9 మంది పోలీసులకు కరోనా)
కాగా అత్యంత సదుపాయాలతో ఉన్న జెజె హాస్పిటల్ పక్కనే జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ కూడా ఉండటంతో ఇంకా వైరస్ ఎవరెవరికి సోకిందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఆదివారం ఒక్కరోజే పైథోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరుగురికి, నాగ్‌పాడాకు చెందిన ముగ్గురు, మహిమ్ పోలిస్ స్టేషన్‌లోని ఇద్దరు పోలీసులు కోవిడ్ భారిన పడినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 42 వేలకు పైగానే కరోనా కేసులు నమోదుకాగా, ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 12,974 కేసులు నమోదయ్యాయి. 548 మంది మరణించారు. (కొత్తజంటకు పోలీసుల వైరైటీ రిసెప్షన్)
Comments
Please login to add a commentAdd a comment