పసిపాప కడుపులో పిండం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏడాది పాప కడుపులో పిండం ఉన్న అరుదైన ఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో వెలుగు చూసింది. పులియంపట్టికి చెందిన రాజు, సుమతి దంపతులకు నిశా అనే ఏడాది పాప ఉంది. ఇటీవల పాప పొట్ట అసాధారణంగా పెరగడంతో తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. స్కాన్ తీసిన వైద్యులు కడుపులో పిండాన్ని గుర్తించారు. పాప ప్రాణానికి ముప్పు ఉండటంతో సోమవారం శస్త్రచికిత్స చేసిన వైద్యులు మూడు కేజీల పిండాన్ని తొలగించారు.
పిండానికి అప్పటికే జుట్టు, కొన్ని ఎముకలు ఏర్పడ్డాయని డాక్టర్ విజయగిరి తెలిపారు. పాప తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో తల్లి గర్భంలో రెండు పిండాలు ఏర్పడి ఉంటాయని, వాటిల్లో ఒకటి ఈ పాపకాగా, మరో పిండం ఈ పాప కడుపులోకి చేరిందన్నారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటోంది.