క్లైమెట్ జస్టిస్‌పై మోదీ కొత్త బుక్‌! | 5 Facts On PM Narendra Modi's New Book | Sakshi
Sakshi News home page

క్లైమెట్ జస్టిస్‌పై మోదీ కొత్త బుక్‌!

Published Thu, Dec 10 2015 12:42 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

క్లైమెట్ జస్టిస్‌పై మోదీ కొత్త బుక్‌! - Sakshi

క్లైమెట్ జస్టిస్‌పై మోదీ కొత్త బుక్‌!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాసిన తాజా పుస్తకం 'కాన్వినియెంట్ యాక్షన్-కంటిన్యూటీ ఫర్‌ ఛేంజ్' బుధవారం పారిస్‌లో విడుదల అయింది. వాతావరణ మార్పుల సదస్సు కాప్‌-21 సందర్భంగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్‌, పలువురు ప్రపంచాధినేతలు పాల్గొన్నారు.

ఈ పుస్తకం గురించిన విశేషాలు
- వాతావరణ మార్పుల సమస్య తీవ్రతను తగ్గించేందుకు భారత్ చేస్తున్న కృషి, వాతావరణ న్యాయం ఆవశ్యకతను వివరిస్తూ తాను ఈ పుస్తకం రాసినట్టు ప్రధాని మోదీ గురువారం ఉదయం ట్వీట్ చేశారు.
-తక్కువ కార్బన్ విడుదల చేసే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చేందుకు జరుగుతున్న కృషిని ఆయన పుస్తకంలో వివరించారు.
- ఈ పుస్తకాన్ని లెక్సిస్‌నెక్సిస్‌ సంస్థ ప్రచురించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, జపాన్ వంటి దేశాల ప్రధాన నగరాల్లో పుస్తకం విడుదలైంది.
-గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోదీ 'కన్వినియెంట్ యాక్షన్: గుజరాత్ రెస్పాన్స్ టు చాలెంజ్స్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్' పుస్తకాన్ని రాశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement