6 కోట్ల మందికి మంచి నీరు లేదు..
6 కోట్ల మందికి మంచి నీరు లేదు..
Published Tue, Mar 21 2017 1:27 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
కొచీ: భారత్‌లో 6 కోట్ల 30 లక్షల మంది మంచి నీరు తాగడం లేదని ఓ సర్వేలో తేలింది. వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారని, ఇది యూనైటెడ్ కింగ్‌డమ్ (యూకే) జనాభాతో సమానమని ఆ సర్వేలో పేర్కొన్నారు. రేపు ‘ప్రపంచ నీటి దినోత్సవం’ సందర్భంగా ‘విల్డ్ వాటర్ సంస్థ’ ప్రపంచ వ్యాప్తంగా మంచి నీటిపై జరిపిన సర్వే వివరాలు వెల్లడించింది. దీనికి కారణం ప్రభుత్వాలు పథకాలు రూపోందించకపోవడం, నీటి వాడకం పెరగడం, జనాభా పెరుగుదల, కరువు పరిస్థితులు, వ్యవసాయానికి నీరును ఎక్కువగా ఉపయోగించడమేనని తెలిపింది.
భారత్ జనాభాలో 6 కోట్ల 30 లక్షల జనాభా గ్రామాల్లోనే ఉందని, వీరంతా మంచినీరు త్రాగడం లేదని రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో వారు కలరా, మలేరియా, కంటిచూపు మందగించడం, డెంగీలాంటి రోగాల భారిన పడతున్నారని తెలిపింది. గ్రామ జీవనం వ్యవసాయంపై ఆధారపడిందని, వీరంతా ఆహారం సమకూర్చడం, పంట దిగుబడికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంది. మంచి నీరును తీసుకురావడంలో మహిళలదే ఎక్కువ బాధ్యత అని, కరువు పరిస్థితుల్లో చాలా దూరం నడిచి నీరు తీసుకొస్తారని రిపోర్ట్‌లో తెలిపింది.
భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, దేశంలో పెరుగుతున్న జనాభాకు మంచి నీటి భద్రత కల్పించడం ఒక పెద్ద సవాలని పేర్కొంది. ప్రపంచంలో ఆరు దేశాలకు ఒక దేశం భూగర్భజలాలను పూర్తిగా వాడుకున్నాయని విల్డ్ వాటర్ సంస్థ తెలిపింది. ఉత్తర భారతదేశంలోని బందెల్‌ఖండ్ ప్రాంతం పూర్తిగా కరువుమయం అయిందని, వరుసగా మూడు సంవత్సరాలు కరువు ఏర్పడటంతో ఆకలి, పేదరికంతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని చెప్పింది. ఈ రిపోర్ట్ వాతావరణంలో చోటుచేసుకునే మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతుందని హెచ్చరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 67 శాతం దేశాల్లోని జనాభా గ్రామల్లో నివసిస్తుందని, 66.3 కోట్ల జనాభా మంచి నీరు తాగడం లేదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సర్వే భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపినట్లు తెలిపింది.
Advertisement
Advertisement