న్యూఢిల్లీ: భారత్‌లో అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యాయి. 2016లో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల్లో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)–2017 నివేదికను విడుదల చేసింది.
మలేరియా నివారణ చర్యలు భారత్‌లో నాసిరకంగా ఉన్నాయని పేర్కొంది. 27 శాతంతో మొదటి స్థానంలో నైజీరియా, 10 శాతంతో కాంగో, నాలుగు శాతంతో మొజాంబిక్ నాలుగో స్థానంలో ఉన్నాయి. మలేరియా మరణాల్లో ఆగ్నేయాసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 33,997 మలేరియా మరణాలతో కాంగో మొదటిస్థానంలో ఉండగా ఆ తరువాత స్థానం ఇండియాదే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 4.45 లక్షల మలేరియా మరణాలు సంభవించినట్లు ఒక అంచనా.
Comments
Please login to add a commentAdd a comment