maleria
-
పీసీఓఎస్ కట్టడికి మలేరియా మందు
మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. దీనిని పూర్తిగా నయం చేయగల చికిత్స ఏదీ లేనప్పటికీ, లక్షణాలను చాలా వరకు నియంత్రణలో ఉంచగల పలు చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, మలేరియా నివారణకు వాడే చైనీస్ సంప్రదాయ ఔషధం పీసీఓఎస్‌ను సమర్థంగా అదుపు చేయగలదని లండన్ శాస్త్రవేత్తలు జరిపిన ఒక తాజా పరిశోధనలో తేలింది.చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే మూలికల నుంచి వేరు చేసి రూపొందించిన ‘ఆర్టిమిసినిన్’ అనే ఔష«ధాన్ని చాలాకాలంగా మలేరియా చికిత్సలో ఉపయోగిస్తున్నారు. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు ఈ ఔషధాన్ని పన్నెండు వారాల పాటు వాడినట్లయితే, వారిలో పీసీఓఎస్ లక్షణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు ‘ఆర్టిమిసినిన్’ను పన్నెండు వారాలు వాడిన తర్వాత వారిలో నెలసరి సక్రమంగా రావడంతో పాటు టెస్టోస్టిరాన్ విడుదల తగ్గుముఖం పట్టినట్లు నిర్ధారణకు వచ్చారు.పీసీఓఎస్ చికిత్సలో ఇది సరికొత్త పరిణామమని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన సీనియర్ క్లినికల్ లెక్చరర్ డాక్టర్ చన్న జయసేన వెల్లడించారు. పీసీఓఎస్ సమస్య అండాశయాల్లోనే మొదలైనా, ఇది మొత్తం శరీరమంతా ప్రభావం చూపుతుందని, దీనివల్ల స్థూలకాయం, అవాంఛిత రోమాలు పెరగడం, గుండెజబ్బులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని, పీసీఓఎస్‌తో బాధపడే మహిళల ఆరోగ్యాన్ని ఈ ఔషధం గణనీయంగా మెరుగుపరచగలదని ఆయన తెలిపారు.ఇవి చదవండి: Health: నేను నాలా లేను..!? -
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్‌పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
విషమిస్తోంది.. కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో విష జ్వరాలు కమ్ముకుంటున్నాయి. పల్లెలు, ఆదివాసీ గూడేలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఊళ్లకు ఊళ్లు నీరసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వేలాది మంది బాధితులు క్యూ కడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇక చాలా ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ బాధితులకు ప్లేట్లెట్లు ఎక్కించే సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరు పాత జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ముందుగా గుర్తించలేక, సరైన సమయంలో చికిత్స అందక డెంగీ, ఇతర జ్వరాలబారిన పడ్డవారు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ డెంగీతో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మరో యువకుడు టైఫాయిడ్‌తో ప్రాణాలు వదిలారు. మూడు ఊళ్లు.. 200 మంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం, ఇల్లందులపాడుతండా, తవిశలగూడెం గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొదట ఈ నెల 4న ఇల్లందులపాడుతండాలో డెంగీ లక్షణాలతో ఒకరిద్దరు మంచాన పడ్డారు. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లో కలిపి 200మందికిపైగా డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు ఇద్దరు డెంగీ లక్షణాలతో చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా.... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విష జ్వరాలు కమ్ముకున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే లైన్‌తండా గ్రామంలో 12 మంది జ్వరాల బారిన పడ్డారు. భూపతిపేట, మచ్చర్ల గ్రామాలు, మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోనూ ఇదే పరిస్థితి. విష జ్వరాల బాధితులతో గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పడకలన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత నెల వ్యవధిలో విషజ్వరాలు, మలేరియా, డెంగీతో 35 మందికిపైగా చనిపోయారు. అందులో 20 మంది డెంగీ బాధితులే ఉన్నట్టు సమాచారం. అధికారిక లెక్కల ప్రకారమే.. జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు 32 వేల మందికిపైగా విషజ్వరాల బారినపడ్డారు. ►ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి జ్వర పీడితులతో నిండిపోయింది. పిల్లల వార్డులోనే వంద మందికిపైగా పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి రోజూ 100 మందికిపైగా విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్య సిబ్బంది చెప్తున్నారు. ►ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగీ, మలే రియా, ఇతర విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గిరిజన తండాలు ఎక్కువున్న దేవరకొండ ప్రాంతంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. ►నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోయాయి. ఒక్కో ఆస్పత్రిలో పది నుంచి ఇరవై మంది డెంగీ, మలేరియా బాధితులున్నట్టు తెలిసింది. నిజామాబాద్ పట్టణంతోపాటు ఆర్మూర్, పోచంపాడ్, బాల్కొండ, భీంగల్, డిచ్పల్లి, సిరికొండ, నందిపేట, నవీపేట ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే.. 67 డెంగీ కేసులు, 2 చికున్‌గున్యా, 32 మలేరియా కేసులు నమోదయ్యా యి. అనధికారికంగా ఈ సంఖ్య వందల్లో ఉంటుందని స్థానిక అధికారులే చెప్తున్నారు. ►ఖమ్మం జిల్లాలో జూలైలో 42, ఈ నెలలో ఇప్పటివరకు 38 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో విషజ్వరాల బాధితులు కనిపిస్తున్నారు. డెంగీతో నాయబ్ తహసీల్దార్ .. నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నాయబ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కొంతం శ్రీకాంత్(40) మంగళవారం డెంగీ బారినపడి మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని నాయుడివాడకు చెందిన ఆయన.. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలో వివిధస్థాయిల్లో పనిచేశారు. ఇటీవలే కలెక్టరేట్‌కు బదిలీపై వచ్చారు. నాలుగైదు రోజుల క్రితం తీవ్ర జ్వరంరాగా స్థానిక ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. మంగళవారం వేకువజామున హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. శ్రీకాంత్‌కు భార్య జ్యోతి, కూతురు(12), కుమారుడు(10) ఉన్నారు. టైఫాయిడ్‌తో యువకుడు మృతి ఇంద్రవెల్లి (ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు చెందిన అశోక్ (25) వారం కింద టైఫాయిడ్ బారినపడ్డాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మంగళవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొమిలిపెంటకు చెందిన ఈ మహిళ పేరు జల్ల ముత్తమ్మ. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ.. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది. వారమైనా జ్వరం అదుపులోకి రాకపోవడంతో మన్ననూరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటోంది. అడ్డగోలు వసూళ్లకు దిగిన ఆస్పత్రులు విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు పెరుగుతుండటంతో ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలు వసూళ్ల దందాకు దిగుతున్నాయి. అందులోనూ డెంగీ బారినపడ్డ వారి నుంచి రోజుకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. రోగులకు ప్లేట్లెట్లు ఎక్కిస్తూ.. ఒక్కో బ్యాగ్‌కు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. కన్సల్టేషన్, బెడ్, ఇతర చార్జీలు, మందుల పేరిట మరింతగా బిల్లులు వేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. -
యాంటీ మలేరియా డ్రగ్‌తో డాక్టర్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : గౌహటిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనస్థియాలజిస్ట్‌గా పని చేస్తోన్న అస్సాంకు చెందిన 44 ఏళ్ల డాక్టర్ ఉత్పల్‌జిత్ బర్మన్ మార్చి 29వ తేదీన మరణించారు. భారత వైద్య పరిశోధనా మండలి సిఫార్సు మేరకు యాంటీ మలేరియా డ్రగయినా ‘హైడ్రోక్సిక్లోరోక్విన్’ తీసుకోవడంతో మరణించినట్లు ఆయన సహచర వైద్యులు తెలియజేశారు. కరోనా వైరస్ నిర్ధారిత రోగులు లేదా కరోనా రోగులకు వైద్యం చేయడం ద్వారా కరోనా బారిన పడే అవకాశం ఉందని భావించిన వారు ఈ ‘హైడ్రోక్సిక్లోరోక్విన్’ను తీసుకోవాల్సిందిగా భారత వైద్య పరిశోధనా మండలి సూచించింది. బర్మన్ పని చస్తోన్న ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకిన రోగులు ఎవరూ చేరలేదని, అలాంటప్పుడు ముందు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన యాంటీ మలేరియా డ్రగ్‌ను ఆయన ఎందుకు తీసుకున్నారో అర్థం కావడంలేదని సహచర వైద్య సిబ్బంది తెలిపారు. ‘కరోనా వైరస్ నివారణకు హైడ్రోక్సిక్లోరోక్విన్ సరైన మందు కాదు. నేను దీన్ని తీసుకున్న తర్వాత నాకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి’ అని ఆదివారం మధ్యాహ్నం 1.04 గంటలకు డాక్టర్ బర్మన్ తోటి వైద్యులకు మిస్సేజ్ పెట్టారు. ఆ తర్వాత రెండు గంటల తర్వాత నర్సు వత్తిలో కొనసాగుతున్న డాక్టర్ బర్మన్ భార్య, బర్మన్ సహచర వైద్యులకు ఫోన్‌చేసి ఆయనకు గుండెపోటు వచ్చినట్లు చెప్పారు. సహచర వైద్యులు బర్మన్ ఇంటికి వెళ్లి ఆయన్ని మరో ప్రైవేటు ఆస్పత్రికి హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ 20 నిమిషాల తర్వాత బర్మన్ చనిపోయారు. గుండె కండరాలకు హఠాత్తుగా రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల ఆయన మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు ఎందుకు వచ్చిందో వారు చెప్పలేక పోయారు. గుండెపోటు వచ్చినప్పుడు తీసే ‘ఎలక్ట్రోకార్డియోగ్రామ్’ తీయకపోవడం, చనిపోయిన తర్వాత అటాప్సీ చే యక పోవడంతో అసలు కారణం వెలుగులోకి రాలేదు. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బర్మన్‌ది గుండెపోటు వచ్చే వయస్సు కాదని, యాంటి మలేరియా డ్రగ్ తీసుకోవడం వల్లనే ఆయన మత్యువు బారిన పడ్డారని సహచర వైద్యులు చెప్పారు. -
కరోనా చికిత్స: ఆ మందులు డేంజర్
ఆరెగాన్ : కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సిక్లోరోక్వైన్, యాంటీ బయోటిక్ అజిత్రో మైసిన్లు రోగి హృదయ స్పందనలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని యూఎస్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఈ మలేరియా యాంటీ బయోటిక్ డ్రగ్ కాంబినేషన్ కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని ఆరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ అండ్ ఇండియానా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంబినేషన్ డ్రగ్ల కారణంగా అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందంటున్నారు. కొన్ని వందల రకాల మందులు కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తాయని వెల్లడించారు. ( కరోనా: వాటి మాయలో పడకండి! ) ఆరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ ఎరిక్ స్టెకర్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు మహమ్మారి చికిత్స కోసం హైడ్రాక్సిక్లోరోక్వైన్, యాంటీ బయోటిక్ అజిత్రో మైసిన్లు విరివిరిగా ఉపయోగిస్తున్నారు. కరోనా బాధితుడిపై అవి ఎంత వరకు సానుకూల ప్రభావం చూపుతాయన్న దానిపై మా దగ్గర చాలా తక్కువ సమాచారం ఉంది. ఈ కాంబినేషన్‌ను వాడుతున్న వారు దాని ద్వారా ఎదురయ్యే దుష్ప్రభావాలపై తప్పకుండా జాగ్రత్త వహించాలి. ఈ కాంబినేషన్‌తో చికిత్స చేస్తున్నవారు బాధితుల హృదయ స్పందనలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. ఏది ఏమైనా కరోనాకు మందు లేకపోవటాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల’ని అన్నారు. -
ఆరోగ్య మంత్రి గారూ... ఇటు చూడండి!
‘‘నగరంలోని హుస్సేన్‌పురకు చెందిన హలీమాబీ విషజ్వరంతో బాధపడుతూ ఆదివారం ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే వైద్యులెవరూ పట్టించుకోకపోవడంతో మరణించినట్లు బంధువులు ఆరోపించారు. రాత్రి వేళలో ఒక డాక్టర్ కూడా అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడం వల్లనే మరణించిందని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్‌ను సంప్రదించగా.. రెండు రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతోందని, దీంతోపాటు రక్తహీనత(ఎనేమియా)తో ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరిందని, ఆస్పత్రిలో చేరేసరికే 50వేల రక్తకణాలు మాత్రమే ఉన్నాయని, మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు.’’ సాక్షి, కరీంనగర్: సాక్షాత్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాను విషజ్వరాలు చుట్టుముట్టాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృత్యుఘోష వినిపిస్తోంది. ఆస్పత్రిలో ఏ వార్డు వద్ద చూసినా విషజ్వరాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులు, వారి బంధువులు కనిపిస్తున్నారు. ప్రాణాంతకమైన డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఎక్కువ శాతం రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి మెరుగైన వైద్యం అందక మరణిస్తున్నారు. ప్రస్తుతం శిశువులు, పిల్లలు, మైనర్లతోపాటు వృద్ధులు ఎక్కువగా విషజ్వరాలతో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరుతున్నారు. కాగా మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో డెంగీ కేసుల వివరాలు తెలియజేసేందుకు కూడా వైద్యాధికారులు జంకుతున్నారు. ఆస్పత్రిలో ఆగని మరణాలు.. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో వివిధ రోగాలతో బాధపడుతూ సరైన చికిత్స అందక పేద రోగులు మరణిస్తున్నారు. మే 21న ప్రభుత్వాస్పత్రిలో కోనరావుపేట మండలం మార్దన్నపేట గ్రామానికి చెందిన బాలింత ఊరగంట మానస(22) సరైన చికిత్స అందక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించింది. సాధారణ ప్రసవం కోసం కాలయాపన చేసి చివరి నిమిషంలో ఆపరేషన్ చేశారని, తీవ్ర రక్తస్రావం అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మానస మృతిచెందిందని బంధువులు ఆందోళన చేశారు. ఆగస్టు 11న తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ, మహాత్మనగర్‌కు చెందిన కనుమల్ల లావణ్య(22) జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విషజ్వరంతో బాధపడుతూ ఆగస్టు 9న ఆస్పత్రిలో చేరింది. ఫిమేల్‌వార్డులో రెండు రోజులపాటు చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో ఐసీయులోకి షిఫ్ట్ చేశారు. రక్తంలో కణాలు తగ్గిపోయాయని ప్లేట్లెట్ ఎక్కించారు. అయినా కోలుకోక చికిత్స పొందుతూ 11న మృతిచెందింది. వార్డులో ఉన్నపుడు రెండురోజులపాటు వైద్యులు పట్టించుకోకపోవడంతోనే లావణ్య మరణించిందని భర్త రమేష్ బంధువులు ఆందోళన చేశారు. ప్లేట్లెట్స్ కొరతతో రోగులకు ప్రాణసంకటం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు నిఖిల్(16) పిల్లల వార్డులో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. విషజ్వరంతోపాటు లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ 7వేలకు తగ్గిపోయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆడెపు లత, సత్యనారాయణ కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. కనీసం పేట్లెట్స్ ఇవ్వడానికి బంధువులు, దాతలు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రభుత్వం ఆదుకొని తమ కొడుకు ప్రాణాలు నిలుపాలని వేడుకుంటున్నారు. ఇది ఒక్క నిఖిల్ పరిస్థితే కాదు. ఇటీవల మంత్రి ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో దార హరికృష్ణ(24) డెంగీ వ్యాధితో మృతిచెందాడు. చాలామంది రోగులు ప్లేట్లెట్స్ సమకూరక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ప్లేట్లెట్ కౌంట్ కనీసం లక్ష దాటితే తప్ప డెంగీ రోగం నయమయ్యే పరిస్థితి లేదు. దాతలు ఇచ్చే రక్తం నుంచి తెల్లరక్త కణాలను వేరు చేసి, డెంగీ వ్యాధిగ్రస్తులకు ఎక్కించాల్సి ఉంటుంది. జిల్లాలో రక్తదాతలు ముందుకు రాకపోవడం, వైద్యాధికారులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోకపోవడంతో రోగుల పరిస్థితి విషమంగా మారుతోంది. డెంగీ కేసులు ఇలా.. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 2019 ఏప్రిల్‌లో 116 డెంగీ కేసులు నిర్ధారణ కాగా మేలో 153 కేసులు, జూన్‌లో 91, జూలైలో 112, ఆగస్టులో 61, సెప్టెంబర్‌లో ఇప్పటికే 30మందికి డెంగీ నిర్ధారణ అయింది. డీఎంహెచ్ఓ పరిధిలో మాత్రం సెప్టెంబర్‌లో 21 కేసులు మాత్రమే నమోదు అయినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. డీఎంహెచ్ఓ పరిధిలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 72కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో మలేరియా విజృంభించినప్పటికీ, ఇప్పటి వరకు 4కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జ్వరపీడితుల్లో అధికసంఖ్యలో డెంగీతో బాధపడుతుండగా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలో డెంగీ బారిన పడుతున్నట్లు చూపుతుండడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రిలో అదనపు పడకలు.... 500 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 150 పడకలు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి కేటాయించారు. మిగతా 350పడకలతో మిగతా వార్డుల్లో రోగులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుండడంతో ఆస్పత్రి వరండాలో అదనపు పడకలు వేసి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 100కుపైగా అదనపు పడకలు సమకూర్చినట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. వరండాల్లోనే వైద్య సేవలు అందిస్తుండడంతో చలిగాలులు, దోమల బెడదతో కనుకు తీయలేని పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. ప్రతిరోజు ఆస్పత్రిలో 600 వరకు ఓపీ జరుగుతుండగా 100మందికి పైగా ఇన్పేషెంట్లుగా ఆస్పత్రిలో చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. -
భారత్‌లో 8 శాతం మలేరియా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యధిక మలేరియా కేసులు నమోదయ్యాయి. 2016లో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల్లో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)–2017 నివేదికను విడుదల చేసింది. మలేరియా నివారణ చర్యలు భారత్‌లో నాసిరకంగా ఉన్నాయని పేర్కొంది. 27 శాతంతో మొదటి స్థానంలో నైజీరియా, 10 శాతంతో కాంగో, నాలుగు శాతంతో మొజాంబిక్ నాలుగో స్థానంలో ఉన్నాయి. మలేరియా మరణాల్లో ఆగ్నేయాసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 33,997 మలేరియా మరణాలతో కాంగో మొదటిస్థానంలో ఉండగా ఆ తరువాత స్థానం ఇండియాదే కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా 4.45 లక్షల మలేరియా మరణాలు సంభవించినట్లు ఒక అంచనా. -
గిరిజనులకు దేవుడే దిక్కా?
మలేరియా మందులు అందుబాటులో లేవు పేదల వైద్యం పట్టని ప్రభుత్వం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం మారేడుమిల్లి : ఏజెన్సీలో మలేరియా తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా మందులు లేకపోవడం చూస్తే ఈ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమవుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రెండురోజుల ఏజెన్సీ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి మారేడుమిల్లి వనవిహారిలో బస చేసిన జగన్ గురువారం ఉదయం స్థానిక పీహెచ్‌సీని సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముగ్గురు వైద్యా ధికారులకు ఒక్కరు మాత్రమే ఉన్నారని, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం కాగా ఒకరే ఉన్నారని వారు తెలిపారు. పీహెచ్‌సీలోని సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు వసతులు, మందులు అందుబాటులో ఉన్నాయా అని సిబ్బందిని ప్రశ్నించగా మలేరియా మందులకు కొరత ఉందని ఇండెంట్ పెట్టినా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కాలేదని తెలిపారు. మలేరియా తీవ్రంగా ఉన్న ప్రాంతంలో కూడా అత్యవసరమైన మందులు లేకపోవడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆరోగ్యంపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదన్నారు. సిబ్బందికి నాలుగు నెలల జీతాలు లేవని జగన్‌కు వివరించారు. జీతాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో ఎలా సేవలు అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో నూతనంగా నిర్మాణం తలపెట్టి మధ్యలో నిలిచిపోయి భవనాన్ని పరిశీలించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మారేడుమిల్లి పీహెచ్‌సీని సందర్శించి ఏడాది గడుస్తున్నా భవన నిర్మాణంలో కదలిక లేకపోవడం వెనుక ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నాయకులు కర్రి పాపారాయుడు, జిల్లా కార్యదర్శి గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ సభ్యుడు సత్తిసత్యనారాయణరెడ్డి,ఎంపీపీ కుండ్ల సీతామహలక్షి్మ, ఎంపీటీసీ సభ్యుడు అనిల్‌ప్రసాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి
∙జాయింట్ డైరెక్టర్ సుబ్బలక్ష్మి ఎంజీఎం : సీజనల్ వ్యాధుల నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మలేరియా, డెంగ్యూ, మెదడువాపు కేసులు నమోదైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కారణాలు విశ్లేషించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్(ఎపాడమిక్స్) జి.సుబ్బలక్ష్మి సూచిం చారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కువగా జ్వరాలు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటా స ర్వే నిర్వహించి, వ్యాధుల ప్రబలకుండా అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, ఐకేపీలతో సమన్వపరుచకుంటూ ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. సమీకృత వ్యాధి సర్వేలె¯Œ్స ప్రాజె క్టు ఐడీఎస్పీలో భాగంగా పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రులు ఫారం–పి (పీహెచ్‌సీకి సంబంధించిన ఫారం) ఫారం–ఎస్ (ఉపకేంద్రానికి సంబంధించినది), ఫారం–ఎల్(ల్యాబ్‌కు సంబంధించినది) రిపోర్టులను తప్పనిసరిగా పంపించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ శ్రీరాం, మధుసూదన్, డీఐఓ హరీశ్‌రాజు, ఐడీఎస్పీ అధికారి కృష్ణారావు, అశోకా ఆనంద్, వెంకటరమణ, సుధీర్, డెమో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పాశ్చ్యానాయక్‌తండ(చివ్వెంల) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డివిజన్ మలేరియా నియంత్రణ అధికారి తీగల నర్సింహ అన్నారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసాలు బద్యాతండా, పిల్లల జెగ్గుతండా, తుమ్మల జెగ్గుతండా, భోజ్యతండా, జయరాం గుడి తండా, హలవత్తండా, భీమ్లాతండా, పాండుతండాల్లో ఇళ్లలో దోమల నివారణ మందులను స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇళ్ల మందు మురుగు నీరు నిలువ కుండా చూసుకోవాలని, వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ బూతరాజు సైదులు, ఎఎన్ఎం లూర్దు మేరి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఆశ వర్కర్లు జ్యోతి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
మన్యం రోగాల మయం!
–పట్టించుకోని ప్రభుత్వం –కొనసాగుతున్న చావులు –అదుపులోకి రాని వ్యాధులు సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యం రోగాలతో అల్లాడిపోతోంది. మలేరియా, డయేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాలతో పాటు మాతాశిశు మరణాలతో తల్లడిల్లుతోంది. ఎపిడమిక్ సీజను మొదలైన్పట్నుంచి నిత్యం ఎక్కడోచోట వ్యాధులతో చావు డప్పు మోగుతూనే ఉంది. గత ఏడాదికంటే మలేరియా తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు కడుతోంది. అయినా మన్యంలో మలేరియా మరణాలు ఆగడం లేదు. అవి చాలవన్నట్టు అతిసార చావులూ వెంటాడుతున్నాయి. మునుపటికంటే ఈ ఏడాది మాతాశిశు మరణాలూ అధికమయ్యాయి. ఒక్క డుంబ్రిగుడ మండలంలోనే ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే అప్పుడే పుట్టిన నలుగురు శిశువులు మత్యువాతపడ్డారు. ఏప్రిల్–జులై మధ్య 15 మంది బాలింతలు, 113 మంది పసికందులు అశువులు బాశారంటే ఏజెన్సీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన్యంలో చాలా ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడినంతమంది వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. దోమల బారి నుంచి రక్షణ కల్పించే దోమతెరలనూ ఏళ్ల తరబడి సరఫరా చేయడం లేదు. నివేదికలు పంపుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వమూ కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. దోమలను నియంత్రించే మందు పిచికారీ పనుల్లోనూ అలసత్వమే నెలకొంది. తొలివిడత స్ప్రేయింగ్ చేసిన సిబ్బందికి కూలీ సొమ్ము ఇప్పటికీ చెల్లించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. గడచిన ఏడు నెలల్లో ఏజెన్సీలో నాలుగున్నర లక్షల మందికి జ్వరాల సోకినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇందులో 4,500కు పైగా మలేరియా రోగులే. ఇక లెక్కల్లోకి ఎక్కని వారెంతమందో ఊహించవచ్చు. మలేరియా జ్వరాలను అదుపు చేసేందుకిచ్చే మందుల పంపిణీ కూడా అరకొరగానే ఉంది. ఈ ఏడాది మన్యంలో అనేక గ్రామాల్లో డయేరియా తీవ్రరూపం దాల్చింది. దీనిబారినపడి పెద్దసంఖ్యలో గిరిజనులు మత్యువాతపడ్డారు.. పడుతున్నారు. అనధికార లెక్కల ప్రకారం వీరి సంఖ్య 25కు పైగానే ఉందని చెబుతున్నారు. మరోవైపు ఏజెన్సీలో రోగాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని, మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా బాకా ఊదుతూనే ఉన్నారు. మన్యంలో వైద్యసేవల మెరుగుకు ఆగస్టుకల్లా 30 సంచార వైద్యశాలలు ఏర్పాటు చేస్తామన్న గిరిజన సంక్షేమమంత్రి రావెల కిషోర్‌బాబు హామీ, వ్యాధుల అదుపునకు సంచార వైద్యశాలల సిబ్బంది, సీహెచ్‌సీల్లో ఇద్దరేసి వైద్యుల నియామకాలు చేపడ్తామన్న జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సరోజిని ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రో, ఇతర మంత్రులో వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం హడావుడి చేసేసి చేతులు దులుపేసుకుంటోంది. డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత.. ఏజెన్సీ ఆస్పత్రులలో డాక్టర్లు, వైద్యసిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. పాడేరు, అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో ప్రారంభం నుంచి గైనకాలజిస్టులు, చిల్డ్రన్ స్పెషలిస్టులు అందుబాటులో లేరు. దీంతో మాతా శిశు మరణాల నియంత్రణ కొరవడింది. ప్రా«థమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యుల కొరత కొనసాగుతోంది. 53 డాక్టర్ పోస్టులకు 28 మంది మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది వీరిలో 12 మందికి బదిలీ కాగా 21 మంది కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో మందులిచ్చేవారే కరువయ్యారు. 25 ఫార్మసిస్ట్ పోస్టులు ఖాళీలు భర్తీ కాలేదు. 104.. పట్టించుకోరు.. ఇక సంచార వైద్య (104) సేవలందిస్తామని ఉదరగొడుతున్న ప్రభుత్వం వాటి ద్వారా ఆ సేవలు తూతూమంత్రంగానే అందిస్తోంది.. ఏటా రూ.2 కోట్లు దీనికి కేటాయిస్తున్నా అక్కరకు రావడం లేదు. ఈ సంచార వైద్య సేవల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు వైద్యులే డుమ్మా కొడుతుంటే చోద్యం చూస్తోంది. సగటున 60 శాతం మాత్రమే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటికి కేవలం 17 శాతానికి మించి వైద్యులు హాజరు కావడం లేదు. వ్యాధుల సీజనులో వీటి సేవలెంతో కీలకం. కానీ ఈ సంచార సేవలు ఎప్పటిలాగానే మొక్కుబడిగా సాగుతున్నాయి. అతిసారకు 25 మంది బలి నెల రోజుల వ్యవధిలో ఇప్పటికి మన్యంలో 25 మంది వరకు మత్యువాత పడ్డారు. పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ నారింగ్బాడి గ్రామంలో ముగ్గురు, మినుములూరు పంచాయితీ సల్దిగెడ్డ గ్రామంలో ఒకరు, హుకుంపేట మండలం అడ్డుమండలో ఐదుగురు, డూరువీధిలో ఒకరు, నిమ్మలపాడులో ఐదుగురు గిరిజనులు, పెదబయలు మండలం కిముడు పల్లి పంచాయితీ అరడగూడెం నలుగురు, పులిగొందిలో ఒకరు, పొదుముబందలో ఒకరు, చింతపల్లి మండలం జల్లూరుమెట్టలో ఒకరు, డుంబ్రిగుడ మండలం జంగిడివలసలో ఒకరు, కొట్రగొందిలో ఒకరు చనిపోయారు. మరణ మృదంగం ఇలా.. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు నెలరోజుల్లో ఏడుగురు విద్యార్థులు మతిచెందారు. – 14న సూకూరు ఆశ్రమంలో 6వ తరగతి విద్యార్థి ప్రవీణ్‌కుమార్ – 26న తురకలవలస ఆశ్రమ విద్యార్థిని దూరు మణికుమారి – 28న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆర్జి లక్ష్మీపార్వతి – 29న గోమంగి మినీ గురుకులం విద్యార్థిని కిల్లో భవాని – మార్చి 3న కిలగాడ కస్తూర్భా విద్యార్థిని కె.లక్ష్మి – 9న పెద్దపేట ఎంపీపీ స్కూల్ విద్యార్థి కొర్రా సుభాష్ – 13న అరడకోట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల విద్యార్థి కిల్లో పండు. శిశు మరణాలు –0 నుంచి 9 నెలలు: 2011–12లో 196, 2012–13లో 303, 2013–14లో 264, 2014–15లో 472, 2015–16 ఫిబ్రవరి వరకు 414 – 2011–12 లో 18, 2012–13 లో 15, 2013–14లో 34, 2014–15లో 36, 2015–16 లో 29 నమోదయ్యాయి. మలేరియా మరణాలు.. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నివేదికల ప్రకారం 2010లో 10, 2011లో 4, 2012లో 1 నమోదు కాగా 2013, 2014, 2015 ల్లో మలేరియా మరణాలు నమోదు కాలేదు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నవీపేట: వాతావరణంలో కలిగే మార్పులతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య సూచించారు. మండలంలోని మోకన్‌పల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అభంగపట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన బుధవారం సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత వాతావరణంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా తదితర రోగాలు వ్యాపిస్తాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా మారుమూల గ్రామాల్లో విద్యార్థులు ఇరుగుపొరుగు వారికి అవగాహన కల్పించాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు తిష్టవేసి ఉంటాయని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ముందు జాగ్రత్తగా దోమల నివారణ మందును పిచికారి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీజనల్ వ్యాధులు–నివారణ చర్యలు అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి రమారాణి, ఆస్పత్రి సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్రావ్, సూపర్వైజర్ పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్వైన్‌ఫ్లూతో మరో ఇద్దరు మృతి
గత 25 రోజుల్లో ఐదుకు చేరిన మృతుల సంఖ్య మరోవైపు విజృంభిస్తున్న డెంగీ, మలేరియా సాక్షి, హైదరాబాద్: నగరంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఫ్లూతో బాధపడుతూ చికిత్స కోసం ఇటీవల గాంధీ ఆస్పత్రిలో చేరిన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చిన్మయనగర్‌కు చెందిన మహిళ(23), రంగారెడ్డి జిల్లా నేరేడ్మెట్కు చెందిన వ్యక్తి(49) బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆగస్టు 29 నుంచి ఇప్పటి వరకు గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రస్తుతం ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ వార్డులో ఇద్దరు చిన్నారులతో సహా 9 మంది పాజిటివ్ బాధితులు, డిజాస్టర్ వార్డులో మరో 8 మంది ఫ్లూ అనుమానితులు చికిత్స పొందుతున్నారు. యశోద, కేర్, కిమ్స్, అపోలో, పౌలోమి, రెయిన్బో, ఆదిత్య, అవేర్ గ్లోబల్, కాంటినెంటల్ ఆస్పత్రుల్లో మరో 30 మంది చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల్లో 30 కేసులు... గత మూడు రోజుల్లో 131 మంది బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్ష కోసం ఐపీఎంకు పంపగా, 30 మందికి హెచ్1ఎన్1 పాజిటివ్‌గా నిర్ధారణైంది. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసినా ప్రస్తుతం ఒక్క గాంధీలోనే వైద్య సేవలు అందుతున్నాయి. 98 డెంగీ కేసులు... స్వైన్‌ఫ్లూతో పాటు డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సెప్టెంబర్‌లోనే 98 డెంగీ, 28పైగా మలేరియా కేసులు నమోదు కావడం గమనార్హం. -
డెంగీ వీరంగం !
-
డెంగీ వీరంగం!
* ఆరోగ్యశ్రీ మాత్రం వర్తించదు.. * ‘ప్రైవేట్’ను ఒప్పించలేకపోతున్న సర్కారు * ప్లేట్లెట్ల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న బాధితులు * రాజధాని సహా తెలంగాణ జిల్లాల్లో విజృంభిస్తోన్న డెంగీ, మలేరియా * 846 మందికి డెంగీ, 4,761 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ * ఈ సంఖ్య అంతకు ఐదింతలు పైనే ఉంటుందంటున్న వైద్యనిపుణులు * డెంగీతో రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మరణించినట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: రెక్కాడితేగానీ డొక్కాడని రాజయ్యకు జ్వరమొచ్చింది... సర్కారు దవాఖానాకు వెళితే ‘జ్వరం’ బిళ్లలు ఇచ్చి పంపారు.. అయినా తగ్గక ప్రైవేటు ఆస్పత్రికి వెళితే ‘డెంగీ’గా నిర్ధారించారు... ప్లేట్లెట్లు ఎక్కించాలన్నారు, వేల రూపాయలు ఖర్చవుతాయన్నారు.. ‘ఆరోగ్యశ్రీ’ కార్డు తీసి చూపితే అది పనికిరాదన్నారు.. రాజయ్య కుటుంబ సభ్యులు గొడ్డూగోదా అమ్మి, అప్పు చేసి 60 వేలు తెచ్చి ఆస్పత్రిలో కడితే.. ప్రాణాలతో బయట పడ్డాడు. పేదలను ఆదుకోవాల్సిన ‘ఆరోగ్యశ్రీ’ పనికిరాకుండా పోయింది.. ఒక్క జ్వరం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రాష్ట్రంలో డెంగీ విజృంభణ కారణంగా వందలాది మంది పేదలు, మధ్యతరగతి జీవుల దుస్థితి ఇది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘డెంగీ’కి చికిత్స చేయరు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినా దీనికి ‘ఆరోగ్యశ్రీ’ వర్తించదు. రోజు రోజుకూ విజృంభిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డెంగీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంలో సర్కారు విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ జ్వరాల మాదిరిగానే డెంగీ వస్తోందని, అందువల్ల దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం కష్టమన్న కొద్దిమంది అధికారుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అంతా పేదలే.. దోమలు స్వైర విహారం చేసే మురికివాడలు, గిరిజన పల్లెలు, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా డెంగీ విజృంభిస్తోంది. అటువంటి ప్రాంతాల్లో ఉండేవారంతా దిగువ మధ్యతరగతి వారు, పేదలే. వీరి జీవితాలను డెంగీ పీల్చిపిప్పిచేస్తోంది. గత ఐదేళ్ల సర్కారు గణాంకాలను పరిశీలించినా... డెంగీ మరింతగా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2011లో 520 డెంగీ కేసులు నమోదుకాగా.. ఈ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 846 మందికి డెంగీ వచ్చింది. 4,761 మలేరియా కేసులు, 84 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అదే ప్రైవేటు వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 5 వేల మందికి డెంగీ, 20 వేల మందికి మలేరియా సోకినట్లు తెలుస్తోంది. డెంగీ కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయి, వైద్యం చేయించుకోలేక 50 మంది వరకు మరణించినట్లు అంచనా. ఈ పరిస్థితిని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ చికిత్సతో నయం చేసే అవకాశాలున్నా ప్లేట్లె ట్ల సంఖ్య తగ్గిందంటూ వాటిని ఎక్కిస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో ప్లేట్లెట్ ప్యాకెట్ ధర రూ.15 వేల వరకూ ఉంటోంది. ఒక్కో బాధితుడికి ఐదు నుంచి 20 వరకు కూడా ప్లేట్లెట్ ప్యాకెట్లు ఎక్కిస్తున్నారు. వారం పది రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని చికిత్స చేసినందుకు మొత్తంగా రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు తమ వద్ద వసతులు లేవంటూ.. నిర్ధారణ పరీక్షలకు వీలులేదంటూ ప్రైవేటు ఆసుపత్రులకే పంపిస్తున్నాయి. తమకు నష్టమనే..! ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రస్తుతం 938 వ్యాధులున్నాయి. ఆ జబ్బులకు అయ్యే ఖర్చును ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ప్యాకేజీ ప్రకారం సర్కారు చెల్లిస్తుంటుంది. అయితే డెంగీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తే తమకు నష్టమని భావించిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు... దీనికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ప్లేట్లెట్ల పేరుతో లక్షలకు లక్షలు వసూలుచేసే అవకాశాన్ని కోల్పోతామనే దుర్మార్గపు ఆలోచనతోనే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర జబ్బులకు నిర్ణీత చికిత్స, సమయం వంటివి ఉంటాయి. డెంగీ వస్తే ప్లేట్లెట్ల సంఖ్యను బట్టి వైద్యం ఉంటుంది. పరిస్థితిని బట్టి రోజుల కొద్దీ ఆసుపత్రుల్లో ఉంచాలి. ఈ అంశాలను నిర్ధారించి ప్యాకేజీ ప్రకటించాలి. ఒకవేళ డెంగీని ఆరోగ్యశ్రీలో చేరిస్తే ప్రభుత్వం కనీస నిర్ణీత ప్యాకేజీ ప్రకటిస్తే... తమకు నష్టమని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రైవేటు ఆసుపత్రులకే వంతపాడుతోంది. మరోవైపు ఒక ప్రైవేటు బీమా కంపెనీ డెంగీకి ఆరోగ్య బీమా ఇస్తోంది. రూ.400 ప్రీమియం కడితే డెంగీ చికిత్సకు రూ.50 వేల వరకు ఇస్తామని చెబుతోంది. ఒక కంపెనీయే డెంగీకి బీమా ఇవ్వగలుగుతున్నప్పుడు ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడానికి ప్రభుత్వం వెనుకాడుతుండడం సందేహాస్పదంగా మారింది. పోలియో మాదిరిగా డెంగీపై ఉద్యమం ‘‘డెంగీ జ్వరం వస్తే చావడమేనా? ఇంతకుమించి దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లు ఎక్కించే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు రావాల్సిందే. ప్లేట్లెట్లు తగ్గితే చనిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. పోలియోపై సమరం చేసినట్లుగా డెంగీపైనా చేయాలి. దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి.’’ - శివకుమార్, ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఉద్యోగి ఇది సాధారణ జ్వరమే.. ‘‘డెంగీ సాధారణ జ్వరంలానే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీలో ప్యాకేజీగా ప్రకటించడం కష్టం. డెంగీ వచ్చిన వారిలో కేవలం 5 శాతం మందికే సీరియస్ అవుతుంది. మిగతా వారికి నయం అవుతుంది. ప్రత్యేకంగా డెంగీ కోసం ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు కవరేజీ లేకపోయినా ప్లేట్లెట్లు తగ్గి రక్తస్రావం జరిగితే ప్లేట్లెట్లకు కవరేజీ ఇవ్వొచ్చు..’’ - డాక్టర్ చంద్రశేఖర్, తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో ఐదేళ్లలో తెలంగాణలో డెంగీ కేసులు సంవత్సరం నమోదైనవి 2011 520 2012 576 2013 654 2014 789 2015 (ఇప్పటివరకు) 846 -
గిరిజన గ్రామాల్లో మలేరియా
- జ్వరంతో మంచం పడుతున్న గిరిజనులు - గిరి శిఖర గ్రామాల్లో దుర్భర పరిస్థితి - పట్టించుకోని వైద్యారోగ్య శాఖాధికారులు పార్వతీపురం : గిరిజన గ్రామాలు మలేరి యాతో వణుకుతున్నాయి. గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పడుతున్నారు. గిరి శిఖర గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గతవారం రోజులుగా పార్వతీపురం సబ్- ప్లాన్ పరిధిలోని కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, పా ర్వతీపురం, మక్కువ, సాలూరు తదితర మండలాల్లో మలేరియా, టైఫాయిడ్ తది తర జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈరోజుల్లో జ్వరం అంటే మలేరియాగానే ఉంటోందని వైద్యాధికారులు అంటున్నారు. ప్రస్తుతం మలేరియా జ్వరానికి వైద్యం ఖర్చుతో కూడుకున్నదిగా మార డం, ఆలస్యం చేస్తే పీవీ, పీఎఫ్ ఆపై సెరిబ్రల్ మలేరియాగా మారి ప్రాణాల మీదకు వస్తోంది. ఆర్థికంగా ఉన్నవారు సమీప పార్వతీపురంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతుండగా పేదలు స్థానికంగా అందుబాటులో ఉన్న సంచి వైద్యులను ఆశ్రయిస్తున్నారు. సబ్‌ప్లాన్ ఏరియాలో మలేరియా తిష్ఠ... మూడేళ్లుగా పార్వతీపురం సబ్-ప్లాన్‌లో మలేరియా తిష్ఠ వేసింది. ఎవరికైనా జ్వరమంటే అది తప్పనిసరిగా మలేరియానే అవుతోందని స్థానిక వైద్యులు అంటున్నా రు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, పరిసరాల పరిశుభ్రతపై గిరిజనులకు అవగాహన లేకపోవడమే ఈ వ్యాధి విజృంభణకు కారణం. ప్రతి ఏడాది సబ్-ప్లాన్‌లో వేలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 2011లో ఐటీడీఏ పరిధిలో 29 42 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2012లో 4096, 2013లో 2008 మలేరియా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. గత పక్షం రోజులుగా పార్వతీపురంలో ఏ ఆసుపత్రి చూసినా వందలాది మంది జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి.