రెక్కాడితేగానీ డొక్కాడని రాజయ్యకు జ్వరమొచ్చింది... సర్కారు దవాఖానాకు వెళితే ‘జ్వరం’ బిళ్లలు ఇచ్చి పంపారు.. అయినా తగ్గక ప్రైవేటు ఆస్పత్రికి వెళితే ‘డెంగీ’గా నిర్ధారించారు... ప్లేట్‌లెట్లు ఎక్కించాలన్నారు, వేల రూపాయలు ఖర్చవుతాయన్నారు.. ‘ఆరోగ్యశ్రీ’ కార్డు తీసి చూపితే అది పనికిరాదన్నారు.. రాజయ్య కుటుంబ సభ్యులు గొడ్డూగోదా అమ్మి, అప్పు చేసి 60 వేలు తెచ్చి ఆస్పత్రిలో కడితే.. ప్రాణాలతో బయట పడ్డాడు. పేదలను ఆదుకోవాల్సిన ‘ఆరోగ్యశ్రీ’ పనికిరాకుండా పోయింది.. ఒక్క జ్వరం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.