‘మెజారిటీ గుండ్లు’ కొట్టించిన ఎమ్మెల్యే | A defferent wish to the god | Sakshi
Sakshi News home page

‘మెజారిటీ గుండ్లు’ కొట్టించిన ఎమ్మెల్యే

Published Thu, Jun 16 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

‘మెజారిటీ గుండ్లు’ కొట్టించిన ఎమ్మెల్యే

‘మెజారిటీ గుండ్లు’ కొట్టించిన ఎమ్మెల్యే

సాక్షి ప్రతినిధి, చెన్నై: కోరిక నెరవేరితే మన తలనీలాలు ఇస్తామని మనం దేవుడికి మొక్కుకుంటే ఓకే. అలాకాకుండా మన జుట్టుపై మరొకరు మొక్కుకుంటే? అదే జరిగింది తమిళనాడులో. ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సేలం జిల్లా గెంగవళ్లి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థి మరుదముత్తు విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురై ఓటమి భయం పట్టుకోవడంతో తాను ఎంత మెజార్టీతో గెలిస్తే అంతమందికి గుండ్లు కొట్టిస్తానని దేవుడికి మొక్కుకున్నాడు.

ఆయన డీఎంకే అభ్యర్థిపై 1,185 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఇక ఊరంతా తిరిగి తనతోపాటు గుండు కొట్టించుకోవడానికి 1,185 మందిని ఒప్పించాడు. వారందరినీ చెన్నిమలై బాలమురుగన్ గుడికి తీసుకెళ్లి తలనీలాలు సమర్పింపజేసి మొక్కు తీర్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement