సాక్షి, న్యూఢిల్లీ: ‘నాయకులు నామినేటెడ్ పోస్టులతో బుగ్గకార్లల్లో తిరిగితే సరిపోతుందా? ఉద్యోగాల భర్తీపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల మాటేంటి?’ అంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినందుకు ఉద్యోగులు సంతోషంగానే ఉన్నారు. అయితే తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని విద్యార్థి, యువజనులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
నిరుద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగులకు వెళుతున్నారు. నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధంగా ఉన్నామని టీపీఎస్సీ కూడా ప్రభుత్వానికి తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. గ్రూప్-2 పోస్టులు గ్రూప్-1లోకి అంటూ నోటిఫికేషన్ల జారీని జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది.’ అని విమర్శించారు.
నిరుద్యోగుల సంగతేంటి?: పొన్నం
Published Sat, Feb 7 2015 6:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement